Begin typing your search above and press return to search.

ఉట్టి కొట్టిన సాగ‌ర‌క‌న్య సుపుత్రుడు

By:  Tupaki Desk   |   25 Aug 2019 7:44 AM GMT
ఉట్టి కొట్టిన సాగ‌ర‌క‌న్య సుపుత్రుడు
X
సాగ‌ర‌క‌న్య శిల్పా శెట్టి ఏం చేసినా అది అభిమానుల‌కు ఎంతో ప్ర‌త్యేకంగా క‌నిపిస్తుంది. యోగా నిపుణురాలిగా ఇప్ప‌టికే నిరంత‌రం ప్ర‌తి అభిమానిలోనూ స్ఫూర్తి నింపుతోంది. శిల్పాజీ యోగా డీవీడీలు ప్ర‌తి ఇంట్లో ట్రైనర్ లా ప‌నికొస్తున్నాయి. మ‌రోవైపు శిల్పా శెట్టి ఫ్యామిలీ లైఫ్ - స‌క్సెస్ ఫుల్ బిజినెస్ లైఫ్ కి సంబంధించిన వివ‌రాలు ఫ్యాన్స్ లో నిరంత‌రం స్ఫూర్తి నింపుతూనే ఉన్నాయి.

శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా దంప‌తుల‌ కుమారుడు విహాన్ గురించి తెలిసిందే. నిన్న జ‌న్మాష్ట‌మి సంద‌ర్భంగా అత‌డు ముంబైలోని ఇంటి ప‌రిస‌రాల్లో ఉట్టి కొట్టాడు. ఆ వీడియోని శిల్పా శెట్టి స్వ‌యంగా అభిమానుల‌కు షేర్ చేశారు. ఇక మ‌రో వీడియోలోనూ శిల్పా శెట్టి ఆమె సోద‌రి ష‌మితా శెట్టి ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో శ్రీ‌కృష్ణుని పూజిస్తూ క‌నిపిస్తున్నారు. ఈ వీడియోలో కుంద్రా ఫ్యామిలీ కుటుంబ స‌భ్యులు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల్లో మునిగి క‌నిపిస్తున్నారు.

శ్రీ‌కృష్ణాష్ట‌మికి ద‌క్షిణాది కంటే ఉత్త‌రాదిన కాస్తంత ప్రాధాన్య‌త ఎక్కువే. అక్క‌డ ప్ర‌జ‌లు మూడు రోజుల పాటు ఏక‌బిగిన కృష్ణుని పూజించి త‌రిస్తారు. ముఖ్యంగా కుంద్రాల ఫ్యామిలీలో ఎంత ప్రాముఖ్య‌త ఉందో తెలిపే అరుదైన స‌న్నివేశ‌మిది. మ‌రోవైపు అజ‌య్ దేవ‌గ‌న్ స‌హా ప‌లువురు స్టార్ల కుటుంబాల్లో ఈ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆ ఫోటోలు.. వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.