Begin typing your search above and press return to search.

మసాజ్ తో మత్తెక్కిస్తోందిగా

By:  Tupaki Desk   |   23 Oct 2017 5:49 AM GMT
మసాజ్ తో మత్తెక్కిస్తోందిగా
X
2001 లో నాగార్జున ద్విపాత్రాభినయంతో వచ్చిన ఎదురులేని మనిషి సినిమా గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఆ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా నచ్చింది. ముఖ్యంగా ఆ సినిమాలోని పాటలు చాలా బావుంటాయనే చెప్పాలి. సినిమా కూడా నాగ్ కెరీర్ కి మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా సౌందర్య నటించిన విషయం తెలిసిందే. అలాగే ఆమెతో పాటు మరో స్టయిలిష్ భామ కూడా సినిమాలో కనిపించింది గుర్తుంది కదా.. ఆమె పేరు షెనాజ్ ట్రెజరీ.

ఎదురులేని మనిషి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ ఇంగ్లీష్ మీడియం పిల్ల ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి కొన్ని సినిమాలు చేసింది. రచయితగా పలు షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది. దానితో పాటు అమ్మడు రచయితగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్యన అమ్మడు హాట్ ఫొటోస్ తో రచ్చ చేస్తోంది. ట్రావెలింగ్ షోలు నిర్వహిస్తున్న ఈమె.. మొన్నటికి మొన్న బికినిలో అందరిని పలకరించిన ఈ భామ ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా ఒక హాట్ వీడియో తో దర్శనం ఇచ్చింది. షెనాజ్ ప్రస్తుతం ట్రావెల్ వ్లాగర్ గా చేస్తోంది. ఈ సందర్బంగా ఒక మసాజ్ సెంటర్ కి వెళ్లిన అమ్మడు శరీరం మీద ఒక్క నూలు పోగు లేకుండా మసాజ్ చేయించుకుంది కూడా. అదే విధంగా దాని గురించి వివరించింది కూడా.

ఆ వీడియో క్లిప్పింగ్ ను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది షెనాజ్. ప్రస్తుతం ఆ వీడియో చాలా వైరల్ గా మారింది. మసాజ్ తో మత్తెక్కిస్తోందని నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి