స్టార్ యాంకర్ పరిస్థితి ఇప్పుడు దారుణం

Sat Aug 11 2018 07:00:26 GMT+0530 (IST)

అతి చేస్తే అది ఎంతటి అనర్ధానికి దారి తీస్తుందో చెప్పడానికి  ఈ యాంకర్ నిజమైన ఉదాహరణ..  బాలీవుడ్ ఫేమస్ యాంకర్ కపిల్ శర్మ ఎంతో పాపులర్ అయ్యి తన వివాదాస్పద చర్యలతో అంతే వేగంగా పతనమయ్యాడు..  తన కామెడీతో బాలీవుడ్ బుల్లితెరపై చెరగని ముద్ర వేసిన ఈ యాంకర్.. ఆ తర్వాత తన షోకు వచ్చిన సెలబ్రెటీలను అవమానించేలా కుల్లు జోకులు వేసి అభాసుపాలయ్యాడు. ఇతడి అసందర్భ కామెడీ - ఓవర్ రియాక్షన్ తో సదురు చానెళ్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఇతడిని చానెల్స్ తీసేశాయి.  ఇప్పుడు చేయడానికి షోలు లేక.. మళ్లీ పిలిచేవారు లేక డిప్రెషన్ లోకి వెళ్లినట్టు సమాచారం.ఈ ఏడాది సోనీ టీవీలో ప్రారంభమైన ‘ఫ్యామిలీ టైమ్ విత్ కపిల్ శర్మ’ అనే షోలో కపిల్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. లతా మంగేష్కర్ - ఆశా భోంస్లే - అమితాబ్ బచ్చన్ ల వాయిస్ ను కూడా మిమిక్రీ చేసి ఇతడు అవమానించాడు. ఆ తర్వాత ఈ షోకు వచ్చిన సోనాక్షి సిన్హా ముందే ఆమె తండ్రి శత్రజ్ఞ సిన్హాను కూడా అనుకురించి మాటలు తూలాడు. దీనిపై డైరెక్ట్ గానే సోనాక్షి వార్నింగ్ ఇచ్చింది.  దీంతో సోనీ టీవీ ఆ షోను మధ్యలోనే ఆపివేసి కపిల్ ను యాంకరింగ్ నుంచి తీసేసింది.

ఇలా వివాదాలతో సాగుతున్న షోను సోనీ టీవీ ఆపేసింది. దీని తర్వాత ఇతడికి ఎవ్వరూ చాన్స్ ఇవ్వకపోవడంతో ప్రస్తుతం తాగుడికి బానిస అయ్యి .. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడట.. ప్రస్తుతం కపిల్ శర్మ అమెరికాలో ఉన్నట్టు సమాచారం.