శతమానం.. సంథింగ్ స్పెషల్ షో

Thu Jan 12 2017 09:23:16 GMT+0530 (IST)

సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో శర్వానంద్ నటించిన శతమానం భవతి కూడా ఒకటి. మెగాస్టార్ 150వ మూవీ ఖైదీ నంబర్ 150..  బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి భారీ సినిమాలు ఉన్నా.. శతమానం భవతిపై పూర్తి నమ్మకంతో ఉన్న నిర్మాత దిల్ రాజు.. ఈ నెల14న శతమానం భవతిని థియేటర్లలోకి తెస్తున్నాడు. ఈ మూవీ నటులు.. టెక్నీషియన్స్ తోపాటు వారి కుటుంబాల కోసం.. ఇప్పటికే ప్రత్యేకంగా స్క్రీనింగ్ ఏర్పాటు చేసి ప్రదర్శించడం విశేషం.

ఆత్రేయపురంలో ఉండే ప్రకాష్ రాజ్.. జయసుధల జంట.. విదేశాల్లో ఉన్న తమ వారసులను ప్రతీ ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా పిలిపిస్తుంటారు.  వారి మనవడైన శర్వానంద్ వారితోనే ఉంటాడు. అంత పెద్ద వయసులో ఆ ముసలి జంట ఎలాంటి బాధ పడుతున్నారో.. కుటుంబ సభ్యులకు తెలియ చేసేలా చేయడమే సింపుల్ గా సినిమా కథ అని తెలుస్తోంది. అయితే.. ఈ మూవీలో ఉన్న ఎమోషనల్ టచ్.. అందరి మనసులను ఆకట్టుకుటుందట.

మొదటి ఫ్రేమ్ నుంచి ఆఖరివరకూ విజువల్ గా బాగా రిచ్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. హీరో హీరోయిన్ల మధ్య నడిచే క్యూట్ లవ్ స్టోరీ కూడా ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్.. జయసుధలు ఎలాగూ ఆకట్టుకుంటారు.. శర్వానంద్-అనుపమా పరమేశ్వరన్ ల నటన కూడా హైలైట్ కానుందట. సంక్రాంతి పండుగకు భారీ పోటీలో వస్తున్నా.. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టెయినర్ గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/