Begin typing your search above and press return to search.

సంక్రాంతి రేసులో ఇంకెందరు వస్తారు!

By:  Tupaki Desk   |   17 Sep 2019 7:36 AM GMT
సంక్రాంతి రేసులో ఇంకెందరు వస్తారు!
X
ఈ సీజన్ వదిలేస్తే మంచి కలెక్షన్స్ రావనే అపనమ్మకమో లేక సెంటిమెంట్ పరంగా కలిసి వస్తుందన్న సంప్రదాయమో తెలియదు కానీ ప్రతి సంవత్సరం సంక్రాంతి సీజన్ కు రిలీజవుతున్న సినిమాల సంఖ్య అంతకంతా పెరుగుతూ పోతోంది . రెండు మూడు నుంచి ఇప్పుడు ఏకంగా అయిదారు దాకా పోటీకి సిద్ధపడటం ఒకపక్క ప్రేక్షకులకు ఆప్షన్స్ పెరిగినందుకు సంతోషంగానే ఉన్నా మరోపక్క ట్రేడ్ లో ఒకదాని మీద మరొక ప్రభావం ఎలా ఉంటుందోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు - అల వైకుంఠపురములో - ఎంత మంచివాడవురా పొంగల్ రేస్ కి లాక్ చేసుకోగా డేట్స్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ మూడింటితో పాటు రజనికాంత్ డబ్బింగ్ మూవీ దర్బార్ రావడం కూడా ఖాయమే. ఇప్పటిదాకా కౌంట్ చూసుకుంటే నాలుగు వచ్చాయి. తాజాగా శర్వానంద్ హీరోగా రూపొందుతున్న శ్రీకారం కూడా సంక్రాంతినే టార్గెట్ చేసుకుని షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.

ఓపెనింగ్ రోజే ఇది ప్రకటించారు కాని తర్వాత మార్పు ఉండొచ్చని అందరూ ఆశించారు. అయితే యూనిట్ మాత్రం అదేమి లేదు అన్న రీతిలో డిసెంబర్ నెలాఖరుకంతా ఫస్ట్ కాపీ సిద్ధం చేసేలా ప్లానింగ్ జరుగుతోందట. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియ ఆరుళ్ మోహన్ హీరొయిన్ గా నటిస్తోంది. డిఫరెంట్ సబ్జెక్టుతో రూపొందుతున్న ఈ శ్రీకారంలో ఎంత పోటీ ఉన్నా వాటికి తట్టుకుని నిలబడే ధీటైన కంటెంట్ ఉందని యూనిట్ అంటోంది. మరి చివరి నిమిషం దాకా ఇదే మాట కట్టుబడి పోటీకి సై అంటారో లేక డ్రాప్ అవుతారో జనవరి దాకా వెయిట్ చేయాలి