Begin typing your search above and press return to search.

రాధా.. రిలీజ్ డేట్ కూడా..

By:  Tupaki Desk   |   13 March 2017 10:10 AM GMT
రాధా.. రిలీజ్ డేట్ కూడా..
X
యంగ్ హీరో శర్వానంద్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే వరుసగా సక్సెస్ లు సాధించేశాడు. శతమానం భవతి రీసెంట్ బ్లాక్ బస్టర్ కాగా.. దీనికి ముందు ఎక్స్ ప్రెస్ రాజా.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. రన్ రాజా రన్ లతో మంచి హిట్స్ సాధించేశాడు శర్వానంద్.

ఇప్పుడు రాధా మూవీతో ప్రీక్షకుల ముందుకు వచ్చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న రాధాకు.. కేవలం సెన్సార్ సర్టిఫికేట్ మాత్రమే పెండింగ్. ఇప్పటికే పబ్లిసిటీ కార్యక్రమాలను కూడా ప్రారంభించేయగా.. వరుసగా సినిమాలోని పాటలను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన రెండు పాటలు ఆకట్టుకుంటున్నాయి.

శర్వానంద్ పోలీస్ పాత్రను పోషిస్తున్న రాధా మూవీలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించగా.. కొత్త దర్శకుడు చంద్రమోహన్ ఈ మూవీని రూపొందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై భోగవల్లి బాపినీడు రాధా మూవీ తెరకెక్కింది. సమ్మర్ సీజన్ ప్రారంభంలోనే విడుదల రాధాపై చాలానే అంచనాలు ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/