శర్వా.. అందుకే టోపీ పెడుతున్నావా?

Fri Jan 12 2018 15:03:33 GMT+0530 (IST)

యంగ్ హీరో శర్వానంద్ ఈ మధ్యన ఎక్కడ కనిపించినా తలపై టోపీతోనే కనిపిస్తున్నాడు. ఇలా హ్యాట్ ధరించడం ఇతడికి కొత్తేమీ కాదు కానీ.. అది ఓ స్టైలింగ్ గా మాత్రమే ఉపయోగించేవాడు. కానీ ఇప్పుడు అసలు టోపీ లేకుండా ఎక్కడా కనిపించకపోవడం చూశాక.. పలువురుకి అనుమానం వచ్చింది. శర్వానంద్ టోపీ వెనక ఏదో సీక్రెట్ దాగి ఉందని అంతా సస్పెక్ట్ చేశారు.ఇప్పుడు అదే నిజమని అంటున్నారు పలువురు సన్నిహితులు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు శర్వా. హీరోయిన్ సాయి పల్లవి డేట్స్ ప్రాబ్లెం కారణంగా.. ముందుగా ఆమెతో ఉన్న సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు. కానీ సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ ఓ మూవీ చేయాల్సి ఉంది. ఇప్పుడు శర్వా టోపీకి.. సుధీర్ వర్మ సినిమాకు ఓ కనెక్షన్ ఉందనే సంగతి తెలుస్తోంది. ఈ చిత్రంలో శర్వానంద్ డ్యుయల్ రోల్స్ పోషిస్తాడట. అందులో ఓ రోల్ లో వయసు పైబడిన పాత్రలో కనిపించాల్సి ఉంటుందని తెలుస్తోంది. అందుకే తల నెరిసినట్లుగా కనిపించే లుక్ కోసం శర్వా కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నాడట.

అంతే కాదు.. మొహంపై ముడతలు కూడా పడి ఉంటాయని తెలుస్తోంది. శర్వా చేసిన ఈ మేకోవర్ జనాలను షాక్ కు గురి చేస్తుందని అంటున్నారు. ఇంతగా శర్వా లుక్ ఆకట్టుకుంటుందట. మరో పాత్రలో అచ్చమైన సిటీ కుర్రాడిగా ఫుల్ గ్లామర్ తో కనిపిస్తాడట శర్వానంద్. రీసెంట్ గా లుక్ టెస్ట్ కూడా పూర్తి చేశారని.. యూనిట్ ఫుల్ శాటిస్ఫై అయ్యారని తెలుస్తోంది.