90లో దాదాగా శర్వానంద్

Mon Dec 17 2018 13:51:40 GMT+0530 (IST)

విభిన్నమైన సినిమాలతో నిదానమే ప్రధానం సూత్రాన్ని పాటిస్తున్న శర్వానంద్ ప్రస్తుతానికి తన దృష్టి 21న విడుదల కాబోతున్న పడి పడి లేచే మనసు ప్రమోషన్ మీదే పెట్టాడు. దీని తర్వాత ఏ సినిమా ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో ఉండటం సహజం. నిజానికి దీంతో పాటే సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన మూవీ షూటింగ్ కూడా జరిగింది. కాని ఏవో కారణాల వల్ల కొంత ఆలస్యం అవుతూ వచ్చింది. దీని ప్రస్తావన వచ్చినప్పుడు శర్వానంద్ త్వరగా పూర్తి చేసి వచ్చే సమ్మర్ లోపు విడుదలకు ప్లాన్ చేస్తామని చెప్పాడు.నిఖిల్ కేశవ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న దర్శకుడు సుధీర్ వర్మ శర్వా సినిమా స్క్రిప్ట్ మీదే చాలా కాలం వర్క్ చేసాడు. రొటీన్ కు భిన్నంగా 1990 ప్రాంతంలో వైజాగ్ సిటీ లో జరిగిన కొన్ని నిజ జీవితం సంఘటనల ఆధారంగా ఇది రాసుకున్నాడు. శర్వానంద్ పాత్ర గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తుంది. వీటి సెట్ తాలు కు ఫోటోలు కూడా నెట్ లో కొన్ని నెలల క్రితం వైరల్ అయ్యాయి. దీని తర్వాత ఈ సినిమా తాలుకు అఫీషియల్ అప్ డేట్స్ రావడం ఆగిపోయాయి. శర్వా మాత్రం పడి పడి లేచే మనసు డెడ్ లైన్ కోసం దానికి కొంత బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందని అంటున్నాడు. శర్వానంద్ గ్యాంగ్ స్టర్ షేడ్స్ ఉన్న పాత్ర గతంలో ప్రస్థానంలో మాత్రమే చేసాడు. అది ఇచ్చిన బ్రేక్ వల్లే కెరీర్ స్పీడందుకుంది.

ఇది కూడా అదే తరహా లో ఛాలెంజింగ్ రోల్ లా ఉంటుందని వినికిడి. అయితే ఖచ్చితంగా ఎప్పుడు పూర్తవుతుందనే క్లారిటీ ప్రస్తుతానికి లేదు. ఇంకో నెల రెండు నెలలు అయ్యాక పూర్తి సమాచారం తెలియొచ్చు. విరాటపర్వం 1990 అనే టైటిల్ దీని గురించి ప్రచారంలో ఉంది.  ఇది పూర్తయ్యాక సుధీర్ వర్మ నితిన్ తో రట్ససన్ తెలుగు రీమేక్ చేసే అవకాశాలున్నాయని ఇప్పటికే టాక్ ఉంది.