ఎక్స్ క్లూసివ్: సక్సెస్ లేకపోతే వేరే మాటలు వినాల్సి వచ్చేది

Thu Sep 28 2017 09:45:49 GMT+0530 (IST)

హీరో అంటే ఆరు పాటల్లో చిందేయాలి - నాలుగు ఫైట్లతో హడావుడి చేయాలి అనే రెగ్యూలర్ పాలసీని ఫాలో అవ్వని అతి తక్కువ హీరోల్లో శర్వానంద్ కి అగ్ర తాంబుళం చెందుతుంది. శతామానం భవతి అంటూ ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ గల్లా పెట్టి తెరిచిన శర్వా మహానుభావుడిగా ప్రేక్షకులు ముందుకి రాబోతున్నాడు. ఈ సందర్భంగా శర్వా చెబుతున్న ముచ్చట్లు ఇవే!* థమ్స్అప్ యాడ్ లో నటించిన శర్వాకి - మహానుభావుడుగా నటించిన శర్వాకి తేడా ఏంటి?

థమ్స్ అప్ యాడ్ లో నటించినప్పుడు కెరీర్ కోసం ఎంత ఆరాటపడ్డానో - ఇప్పుడు కూడా నా సినిమాలు పట్ల అంతే అంకితభావంతో ఉన్నా - అప్పటికి ఇప్పటికి నేను ఎక్కువు సినిమాల్లో నటించి ఉండొచ్చు - అవకాశాలు కోసం నేనే వెంటపడ్డ దర్శకనిర్మాతలు ఇప్పుడు నా కాల్షీట్స్ కోసం క్యూలు కట్టొచ్చు - నా సినిమాలు సూపర్ హిట్స్ అవ్వచ్చు కానీ నేనే ఎదిగిన తరువాత వచ్చిన ఈ హంగులు - నేను ఎదుగుతున్నా అని తెలిపే ఈ సంకేతాలు - నేను ఎదిగే క్రమంలో నా చుట్టూ చేరిన ఈ కొత్త బాధ్యతలు నాకు సినిమా పై ఉన్న పిచ్చిని మార్చలేకపోతున్నాయి. అప్పుడు ఇప్పుడు నేను ఒకేలా ఉన్నా నో ఛేంజ్ ఎటాల్!

* ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రేంజ్ కి రావడానికి మీకు చాలా టైమ్ పట్టింది అందరూ షార్ట్ కట్స్  వెతుక్కుంటే మీరు ఎందుకు ఈ లాంగ్ జర్నీని ఎంచుకున్నారు?

అసాశ్వతమే శాశ్వతం అనే పాలసీని నేను బలంగా నమ్ముతాను. తొందరగా వచ్చింది అంతే తొందరగా పోతుంది. పర్లేదు - నాకు ఈ పొజీషన్ రావడానికి బాగానే టైమ్ పట్టింది గనుక ఇప్పుడప్పుడే నేను  తెరమరుగవ్వనులేండి!(నవ్వుతూ). అందరిలా షార్ట్ కట్స్ వెతుక్కుంటూ టైమ్ పాస్ చేసే కంటే - వచ్చిన పాత్రల్లా చేసుకుంటా పోతూ సినిమా సినిమాకి నా యాక్షన్ స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం చేశాను.

* టాలీవుడ్ లో హీరోలు ఎక్కువ ఈ కాంపీటిషన్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు?

హీరోలు మధ్య పోటీ ఉందనే మాటల్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇక్కడ ఎవరి మార్కెట్ వారిది. ఎవరి స్టామినా వారిది. కొన్నేళ్ల క్రితం హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ లు జరిగేవేమో కానీ ఇప్పుడు పరిస్థతి అలా లేనే లేదు ఎందుకంటే ప్రేక్షకులు హీరోలు కంటే వారు నటిస్తున్న కథలకే ఎక్కువ ప్రాధన్యత ఇచ్చి ఆదరణ చూపడంతో యాక్టర్స్ మధ్య కాంపిటీషన్ తగ్గిపోయింది. ఎవరి క్రియేటివిటీ వారిదే ఎవరి కథలు వారివే నా విషయంలో ఇది ఎన్నో సార్లు రుజువు అయింది. నేను కొత్త పాయింట్ ట్రై చేసిన ప్రతిసారి ప్రేక్షకుల నన్ను ఆదరించారు. ఇప్పుడు మహానుభావుడు విషయంలో కూడా అలాగే జరుగుతుందని నేను నమ్మతున్నాను.

* భలే భలే మగాడివోయ్ ఛాయలు మహానుభావుడులో కనిపిస్తున్నాయని అంటున్నారు అది ఎంతవరుకు వాస్తవం?

భలే భలే మగాడివోయ్ కి పనిచేసిన టీమ్ అంతా మహానుభావుడుకి వర్క్ చేయడంతో ఆ సినిమా ఛాయలు ఉంటాయనుకోవడం సహాజం. ఆ సినిమా సక్సెస్ అయింది గనుక మారుతి మళ్లీ అదే ఫార్ములాతో మహానుభావుడు తెరకెక్కిస్తాడని అనుకొని థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులు కచ్ఛితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఓసిడి ఇక్కడ(నవ్వులు).

* ఓసిడి అంటే గుర్తొచ్చింది మీరు రియల్ లైఫ్ లో కూడా ఇలానే ఉంటారట నిజమేనా?

నీట్ గా ఉంటా కానీ ఓసిడి అయితే నాకు లేదు. ఎవ్వరికి ఉండదు క్లీన్ గా ఉండాలని నాకు అంతే. కానీ సినిమాలో నా పాత్రకు మాత్రం మనకంటే కాస్త ఎక్కువు క్లీన్ గా ఉండటానికి ట్రై చేస్తుంటాడు అంతే. మహానుభావుడుకి ఇదే ఫన్ పాయింట్.

* నిర్మాతగా మీ రెండో సినిమా ఎప్పుడు రాబోతుంది?

హ్యపీగా నాలుగు సినిమాలు చేస్తూ - అందర్నీ ఎంటర్ టైన్ చేస్తున్నా అనే సంతృప్తి ఉంది. ఈ టైమ్ లో మళ్లీ ప్రొడక్షన్ లోకి రావాలని నాకు ఉన్నా - టైమ్ దొరకడం లేదు. ఓ సినిమా కంప్లీటైన వెంటనే మరో సినిమా సెట్స్ పైకి వచ్చేస్తోంది. బట్ త్వరలోనే మళ్లీ నా బ్యానర్ నుంచి మరో సినిమా వస్తుందని చెప్పగలను.

* వరుసపెట్టి స్టార్ హీరోల్ని టార్గెట్ చేస్తున్నారు ఎందుకలా?

నేను టార్గెట్ చేసినంత మాత్రన వారి మార్కెట్ కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా లేకపోతే వాళ్ల సినిమాలకి వచ్చినంత కలెక్షన్స్ నాకు వస్తాయ అదేమి లేదు పండుగ సీజన్ లో సినిమా వ్యూయర్ షిప్ చాలా ఎక్కువుగా ఉంటుంది. లక్కీగా ఎక్స్ ప్రెస్ రాజా ఆ తరువాత శతమానం భవతి సంక్రాంతి సీజన్ లో విడుదలై విజయాలు అందుకున్నాయి. అదే సమయంలో చిరంజీవి గారు - బాలకృష్ణ గారు - నాగార్జున గారు ఇప్పుడు మహేశ్ గారు సినిమాలు ఉండటంతో వారిని టార్గెట్ చేస్తున్నా అంటూ ప్రచారం వచ్చేసింది. ఒకవేల ఆ సీజన్ లో నా సినిమాలు విడుదలై ఫ్లాప్ అయితే ఇలాంటి టాక్స్ వచ్చే అవకాశమే లేదు - అప్పుడు వేరే మాటలు నేను వినాల్సి వచ్చేది. కానీ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు.