Begin typing your search above and press return to search.

గ్యాంగ్ స్టర్ అవతారంలో శర్వా

By:  Tupaki Desk   |   23 Nov 2017 6:31 PM GMT
గ్యాంగ్ స్టర్ అవతారంలో శర్వా
X
ఫెస్టివల్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ యువ హీరో సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాడు. చివరగా మహానుభావుడు సినిమా తో మంచి కామెడీ ఎంటర్టైన్ తో అలరించిన శర్వా నెక్స్ట్ రొమాంటిక్ సినోమాతో రాబోతున్నాడు. ఇక ఆ తర్వాత పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ కథతో రాబోతున్నాడు.

రీసెంట్ గా రామానాయుడు స్టూడియోలో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే లవ్ స్టొరీ ని సింపుల్ గా స్టార్ట్ చేశాడు. ఆ సినిమా శర్వా కెరీర్ లో మరో కొత్త లవ్ స్టొరీ కానుందని తెలుస్తోంది. ఇక ఆ సినిమాతో పాటు నిఖిల్ కు లైఫ్ ఇచ్చిన స్వామి రారా డైరెక్టర్ సుదీర్ వర్మతో కూడా ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. అది కూడా చాలా కొత్త కాన్సెప్ట్ అని తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడట. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఆ సినిమా కథ ఉంటుందని టాక్.

ప్రస్తుతం సుదీర్ వర్మ కథను పూర్తిగా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సుదీర్ ఈ ఇయర్ నిఖిల్ తో తీసిన కేశవ మూవీ మంచి హిట్ అయ్యింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆ సినిమా నిఖిల్ కెరీర్ కి కూడా బూస్ట్ ఇచ్చింది. దీంతో యాక్షన్ ఫిల్మ్ ని సుదీర్ చేయగలడు అనే నమ్మకంతో శర్వానంద్ కూడా కాన్సెప్ట్ చెప్పగానే ఒప్పేసుకున్నాడట. ఇక త్వరలో దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చేసి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం.