Begin typing your search above and press return to search.

కొత్త ఫోటోషూట్‌ తో క‌లిసొస్తుందా?

By:  Tupaki Desk   |   4 Oct 2015 1:30 PM GMT
కొత్త ఫోటోషూట్‌ తో క‌లిసొస్తుందా?
X
ల‌వ్‌ లీ గుర్తుందా? అదేనండీ క‌న్న‌డ అమ్మాయి, బెంగ‌ళూరు బ్యూటీ శాన్వి. డైలాగ్ కింగ్ సాయికుమార్ కుమారుడు ఆది హీరోగా న‌టించిన ల‌వ్‌ లీ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించి మెప్పించింది. క్యూట్ లుక్స్‌ - హాట్ అప్పియ‌రెన్స్‌ తో ఆక‌ట్టుకుంది ఈ భామ‌. ఆ త‌ర్వాత హీరో సుశాంత్ స‌ర‌స‌న అడ్డా అనే చిత్రంలో నాయిక‌గా న‌టించింది. మంచు క్యాంపులో రౌడీ అనే చిత్రంలో న‌టించింది. ఆ సినిమాతో గ్లామ‌ర్ డోస్ పెంచేసిందే అన్న టాక్ తెచ్చుకుంది. అయినా ఈ అమ్మ‌డికి వ‌రుస‌గా ఛాన్సులు వ‌చ్చిందే లేదు. స్టార్ హీరోయిన్ స్టాటస్ అందుకున్న‌దే లేదు.

ఇలా అయితే లాభం లేద అనుకుందో ఏమో .. ఇదిగో ఇప్పుడు కొత్త ఫోటోషూట్‌ తో విరుచుకుప‌డింది అమ్మ‌డు. మునుప‌టి కంటే ప‌రువాల‌న్ని దోర‌దోర‌గా తెర‌ప‌రిచింది. అందాల్ని ఎర‌గా వేసేందుకు ఉన్న అన్ని కోణాల్లోనూ ఓపెన్ షో చూపిస్తోంది. ఇదిగో ర‌క‌ర‌కాల భంగిమ‌లు కుర్రాళ్ల‌ను వెర్రెత్తించే భంగిమ‌లు. చూసుకున్న‌వారికి చూసుకున్నంత‌. అయితే శాన్వికి ఈ ఫోటోషూట్‌ లు ఎంత‌వ‌ర‌కూ క‌లిసొస్తాయి? ఇలాంటివాటితో లైమ్‌ లైట్‌ లో ఉన్నా.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో అభిన‌యంలోనూ మెరుగులు దిద్దుకుని, డ్యాన్సింగ్ స్కిల్స్‌ ని మెరుగు ప‌రుచుకుని దూసుకురావాలి. రొటీన్ ప్లాస్టిక్ ఎక్స్‌ ప్రెష‌న్స్ తో ఇక్క‌డ వ‌ర్క‌వుట‌వ్వదు. ఇప్ప‌టికి ఈ అమ్మ‌డిలో ఎంత ప‌రిణ‌తి వ‌చ్చింది అన్న‌ది చాలా కీల‌కం. అదే కెరీర్‌ బండిని న‌డిపిస్తుంది. వింటున్నావా శాన్వి?