Begin typing your search above and press return to search.

2.ఓ వీఎఫ్ ఎక్స్ కంటికి కునుకేది?

By:  Tupaki Desk   |   21 Sep 2018 12:04 PM GMT
2.ఓ వీఎఫ్ ఎక్స్ కంటికి కునుకేది?
X
భారీ విజువ‌ల్ ఎఫెక్ట్స్‌ తో పని చేయించ‌డం అంటే కోరి క‌ష్టాలు కొని తెచ్చుకున్న‌ట్టే. రాత్రులు నిద్ర‌ప‌ట్ట‌దు. ప‌గ‌లు టెన్ష‌న్లు త‌ప్ప‌వు! అన్న చందంగా ఉంటుంది. అలాంటి పాట్లు ప‌డ్డాడు కాబ‌ట్టే ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఈగ‌, బాహుబ‌లి లాంటి సినిమాలు తీశాక వెంట‌నే అలాంటివి మ‌ళ్లీ తీయ‌న‌ని మొండికేశాడు. మామూలు సినిమాల‌తో పోలిస్తే శ్ర‌మ ప‌దింత‌లు అంత‌కుమించి ఉంటుంది. దేశ‌ - విదేశాల్లో గ్రాఫిక్స్ - విజువ‌ల్ ఎఫెక్ట్స్ - మిక్సింగ్ వంటి ప‌నులు చేయించేందుకు అటూ ఇటూ ప‌రిగెత్తాల్సి ఉంటుంది. అందుకోసం రేయింబ‌వ‌ళ్లు ప్ర‌యాణాల‌కే స‌మ‌యం వెచ్చించాల్సి ఉంటుంది. అదేమీ అంత ఆషామాషీ కాదు.

ఇక‌పోతే ప్ర‌స్తుతం సేమ్ స‌న్నివేశాన్ని శంక‌ర్ ఎదుర్కొంటున్నాడు. 2.ఓ చిత్రం అత‌డికి కంటిమీద కునుకు ప‌ట్ట‌నివ్వ‌డం లేద‌న్న‌ది ఇన్‌ సైడ్ సోర్స్ చెబుతున్న మాట‌. న‌వంబ‌ర్ 29 రిలీజ్ తేదీని ప్ర‌క‌టించాడు కాబ‌ట్టి, అందుకు త‌గ్గ‌ట్టే వీఎఫ్ ఎక్స్ ప‌నులు చేస్తున్న టీమ్‌ కి డెడ్‌ లైన్ విధించాడ‌ట‌. అక్టోబ‌ర్ 15 నాటికి స‌మ‌స్తం ప‌ని పూర్త‌వ్వాల‌ని ఆజ్ఞాపించాడ‌ట‌. దాదాపు 540 కోట్ల బ‌డ్జెట్‌ తో ఇండియన్ సినిమా హిస్ట‌రీలో మునుపెన్న‌డూ చేయ‌ని సాహ‌సం చేస్తున్నాడు శంక‌ర్‌. ఆ మేర‌కు మార్కెట్ వ‌ర్గాల నుంచి తీవ్ర‌మైన ఒత్తిళ్లు అత‌డిపై ప‌ని చేస్తున్నాయ‌ట‌. అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం ప‌నులు పూర్తి చేసి రిలీజ్ చేయ‌క‌పోతే చిక్కుల్లో ప‌డాల్సి ఉంటుంది. అందుకే కంటిపై కునుకు ప‌ట్ట‌డం లేదట‌.

అస‌లే ఇదివ‌ర‌కూ వీఎఫ్ ఎక్స్ చేసిన సంస్థ చేసిన ఘోర త‌ప్పిదంతో మొత్తం వీఎఫ్ ఎక్స్ ప‌నిని వేరొక కంపెనీ రిపీటెడ్‌ గా చేయాల్సొస్తోంది. దాంతో అంత‌కంత‌కు ఆల‌స్య‌మవుతూనే ఉంది. ప్ర‌స్తుతం వీఎఫ్ ఎక్స్ ఫైన‌ల్ డ్రాఫ్ట్ రాక‌కోసం వెయ్యి క‌ళ్ల‌తో 2.ఓ టీమ్ ఎదురు చూస్తోంది. లైకా సంస్థ‌లోనూ టెన్ష‌న్ అంత‌కంత‌కు పెరుగుతోంది. ర‌జ‌నీకాంత్ - అక్ష‌య్‌ కుమార్ - ఎమీజాక్స‌న్ వంటి టాప్ స్టార్లు ఈ చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ క‌ష్టం ఫ‌లించి బ‌డ్జెట్‌ కి - ఖ‌ర్చుకు వందింత‌లు లాభాలు పండాల‌ని ఆకాంక్షిద్దాం.