Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ కి డూప్ సెలక్షన్

By:  Tupaki Desk   |   27 Nov 2015 5:15 AM GMT
సూపర్ స్టార్ కి డూప్ సెలక్షన్
X
సూపర్ స్టార్ రజినీకాంత్ నెక్ట్స్ వెంచర్ రోబో2 కోసం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. రజినీ పుట్టిన రోజు అయిన డిసెంబర్ 12న ఈ మూవీ షూటింగ్ అధికారికంగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం కబాలి షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న సూపర్ స్టార్.. మలేషియాలో ఉన్నారు. కబాలి పిక్చరైజేషన్ కంప్లీట్ కాగానే.. వెంటనే శంకర్ తీయనున్న రోబో 2 స్టార్ట్ చేసేస్తారు రజినీ.

ప్రస్తుతం రోబో2కి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీ కోసం ఇప్పటికే మేకప్ ఆర్టిస్ట్ ని ఫైనల్ చేసేశారు. ఐ చిత్రానికి వర్క్ చేసిన సీన్ ఫుట్.. ఎందిరన్2 కి కూడా పని చేయనున్నాడు. ఇక అన్నింటికంటే ముఖ్యమైన డూప్ సెలక్షన్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు డైరెక్టర్ శంకర్. ఇప్పటికే చాలామందికి మేకప్ టెస్ట్ లు చేసేస్తున్నారు. రజినీకి డూప్ లుగా పని చేసేందుకు కరెక్ట్ పర్సనాలిటీలని ఎంపిక చేస్తున్నారు. వీరికి భారీ ఆఫర్స్ ఇస్తూ.. బోలెడు పారితోషికం ఇచ్చి లాంగ్ టైంకి బుక్ చేసుకుంటున్నారు.

గతంలోనూ కొచ్చాడయాన్ కోసం రజినీకి డూప్ ని ఫిక్స్ చేశారు. అప్పట్లో హీరో జీవా రజినీకి డూప్ గా వర్క్ చేశాడు. కానీ రోబో2 విషయానికొస్తే.. కేవలం యాక్షన్ సీన్స్ లో మాత్రమే డూప్ ని ఉపయోగించబోతున్నారు. కాకపోతే.. స్క్రిప్ట్ ప్రకారం ఎక్కువ మంది డూప్ లనే ఉపయోగించాల్సి రావడంతో.. సెలక్షన్ లో చాలా కేర్ తీసుకుంటన్నాడు శంకర్.