Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: హీరో కొడుకుతో హీరోయిన్

By:  Tupaki Desk   |   30 Nov 2016 7:30 AM GMT
ఫోటో స్టోరి: హీరో కొడుకుతో హీరోయిన్
X
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్.. తన ఫ్యామిలీని ప్రపంచానికి చూపించే సందర్భాలు తక్కువగానే ఉంటాయి. తమిళ ఇండస్ట్రీతోపాటు అభిమాలు తల అని ముద్దుగా పిలుచుకునే సూపర్ స్టార్ అజిత్ భార్య ఎవరో కాదు.. గతంలో సఖి లాంటి సినిమాలతో ఆకట్టుకున్న హీరోయిన్ షాలిని. అజిత్ మరదలు.. షాలిని చెల్లెలు అయిన షామిలి కూడా బాల నటి నుంచి హీరోయిన్ గా టర్న్ అయిన అమ్మాయే.

ఇప్పుడు అక్కబావల కొడుకు 'ఆద్విక్' ను ఎత్తుకుని షామిలి దిగిన ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది. గతేడాది మార్చ్ లో అజిత్ రెండో సంతానంగా ఈ చిన్నారి జన్మించగా.. ఇతడి కంటే ముందు అనౌష్క అనే ఆడపిల్ల ఉంది వీరికి. ఇప్పుడీ ఏడాదిన్నర బుజ్జాయి ఆద్విక్ తో హీరోయిన్ షామిలి దిగిన ఫోటో చూడముచ్చటగా ఉంది. ఇద్దరి మొహాల్లో రకరకాల ఫీలింగ్స్ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అక్క కొడుకంటే తనకూ కొడుకే కాబట్టి.. ఓ రేంజ్ లో అల్లరి చేసేస్తోంది షామిలి.

అజిత్ కుమారుడి ఫోటోలు చాలానే ఇంటర్నెట్ లో ఉన్నా.. షామిలి-ఆద్విక్ లు ఇలా కెమేరాలకు చిక్కడం మాత్రం అరుదు. అందుకే ఈ రేర్ ఫోటో ఇప్పుడు వైరల్ అయిపోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/