Begin typing your search above and press return to search.

ఓయ్ పాపపై వేటు పడింది..

By:  Tupaki Desk   |   11 Feb 2016 9:30 AM GMT
ఓయ్ పాపపై వేటు పడింది..
X
బేబీ షామిలిగా సినీ రంగంలో ఫేమస్ అయ్యి.. తర్వాత హీరోయిన్ గా అప్ గ్రేడ్ అయింది షామిలి. తెలుగులో ఓయ్ అంటూ సిద్ధార్ధ్ తో ఓ సినిమా చేసినా, యాక్టింగ్ కి మార్కులు తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఇప్పుడు తనకున్న పొగరుతో ఉన్న ఛాన్సులను పోగొట్టుకుంటోందీ ఓయ్ పాప.

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేస్తున్న కోడి చిత్రంలో షామిలి సెకండ్ హీరోయిన్. ఇందులో నుంచి ఇప్పుడు షామిలిని తప్పించేశారనే వార్త హాట్ టాపిక్ అవుతోంది. రకరకాల రీజన్స్ తో హీరోయిన్స్ ని ఛేంజ్ చేయడం పెద్ద విషయం కాదు కానీ.. కోడి నుంచి తప్పించడం చాలా పెద్ద విషయం అనాలి. ఎందుకంటే.. ఇప్పుడీ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఫిబ్రవరి నెలాఖరు కల్లా షూటింగ్ కంప్లీట్ చేసేయనున్నారు. అంటే 20 రోజుల్లో షూటింగ్ పూర్తి కానున్న మూవీ లోంచి హీరోయిన్ ని మార్చడమంటే రికార్డే. మంత్ ఎండ్ టార్గెట్ తో అన్నీ శరవేగంగా పూర్తి చేస్తుంటే.. షామిలి మాత్రం షూటింగ్ కు అటెండ్ అవకుండా తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. దీనికి తోడు అమ్మడి డిమాండ్స్ కూడా మామూలుగా ఉండవనే టాక్ ఉంది.

ఇలాంటి పరిస్థితి మలయాళ మూవీ విల్లియుమ్ తెట్టి పిల్లియుమ్ తెట్టి కి కూడా వచ్చింది. చివరకు ఎలాగోలా సెట్ చేసుకున్నారు. కానీ ధనుష్ కోడి నుంచి నిర్దాక్షిణ్యంగా పీకేశారు. దీంతో ఇప్పుడీమె చేతిలో విక్రమ్ ప్రభుతో చేస్తున్న వీర శివాజి ఒక్కటే మిగిలింది. ఈ కోడి చిత్రంలో త్రిష ఓ ప్రధాన పాత్రలో కనిపంచనుండడం విశేషం.