Begin typing your search above and press return to search.

బేబికి బావ ఫొటో షూట్ క‌లిసొచ్చిందా?!

By:  Tupaki Desk   |   4 Oct 2015 7:30 AM GMT
బేబికి బావ ఫొటో షూట్ క‌లిసొచ్చిందా?!
X
ఒక‌ప్పుడు క్యూట్ బేబీగా తెర‌పై క‌నిపిస్తూ ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచించి షామిలి. ఇప్ప‌డు ఆమె పెరిగి పెద్ద‌యినా, హీరోయిన్ అయినా ఇంకా బేబి షామిలి అనే పిలుస్తుంటారు తెలుగు ప్రేక్ష‌కులు. అలా పిలిస్తేనే ఆమెని గుర్తు ప‌డ‌తారు మ‌రి. అయితే షామిలి బేబిగా ఆక‌ట్టుకొన్న స్థాయిలో హీరోయిన్‌ గా అల‌రించ‌లేక‌పోయింది. బేబి పాత్ర‌ల‌తో నేష‌న‌ల్ అవార్డు కూడా సొంతం చేసుకొందామె. కానీ హీరోయిన్‌ గా మాత్రం తొలి అడుగుల్లోనే ప‌రాజ‌యాల్ని చ‌విచూడాల్సి వ‌చ్చింది. తెలుగులో `ఓయ్‌`తో ఆమె క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది. అయితే ఆ చిత్రం అనుకొన్న స్థాయిలో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొంద‌లేదు. షామిలి లుక్ కూడా ఏమాత్రం ఆక‌ట్టుకోలేదు. ఒక‌ప్పుడు క్యూట్‌ గా క‌నిపించిన బేబి షామిలి పెద్ద‌య్యాక ఇంకెంత అందంగా ఉంటుందో అన్న అంచనాల‌తో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వెళ్లారు. కానీ వారి అంచ‌నాల్ని అందుకోలేక‌పోయింది షామిలి. దీంతో ఆమెకి మ‌ళ్లీ చెప్పుకోద‌గ్గ స్థాయిలో అవ‌కాశాలు అంద‌లేదు.

అయితే షామిలి మాత్రం ప‌ట్టువ‌ద‌ల‌కుండా హీరోయిన్‌ గా రాణించాల్సిందే అని త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు తాను చేస్తూ వ‌స్తోంది. త‌న అందానికి మ‌రిన్ని మెరుగులు దిద్దుకొని మ‌రోసారి కెమెరా ముందుకొచ్చేందుకు సిద్ధ‌మైంది. ఆమె ఫ్యామిలీ కూడా షామిలిని స‌క్సెస్‌ ఫుల్ హీరోయిన్‌ గా చూడాల‌ని కంక‌ణం క‌ట్టుకొంది. అందుకోసం షామిలి అక్క షాలిని - బావ అజిత్ బోలెడ‌న్ని స‌ల‌హాలు ఇస్తున్నారు. బావ అజిత్‌ లో ఓ మంచి ఫొటోగ్రాఫ‌ర్ ఉన్నాడు. మ‌ర‌ద‌లి కోసం తానే స్వ‌యంగా రంగంలోకి దిగి త‌న కెమెరాతోనే ఫొటో షూట్ చేశాడ‌ట‌. ఆ ఫొటోలు అదిరిపోయేలా ఉన్నాయ‌ట‌. అవ‌న్నీ చూసి త‌మిళ సినీ వ‌ర్గాలు వావ్‌... అంటూ ఆశ్చ‌ర్య‌పోయాయ‌ట‌. ఆ ఫొటో షూట్‌ ని - ఫొటోల్ని చూసే ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాలు బేబి షామిలిని సంప్ర‌దిస్తున్న‌ట్టు తెలుస్తోంది. తెలుగులోనూ ఆమెకి ఇటీవ‌ల నారా రోహిత్‌ తో క‌లిసి న‌టించే అవకాశ‌మొచ్చింది. బావ ఫొటో షూట్ మ‌రద‌లికి అంత‌గా క‌లిసొచ్చింద‌న్న‌మాట‌. అన్న‌ట్టు అజిత్ ఒక్క షామిలినే కాదు... శ్రుతిహాస‌న్‌ తోనూ ఇదివ‌ర‌కు ఇలా ఫొటో షూట్ చేశాడు. సెట్ లో స్టిల్ కెమెరామెన్ ద‌గ్గ‌రున్న కెమెరా తీసుకొని క్లిక్ క్లిక్‌ మ‌నిపించి శ్రుతి ఫొటోలు తీసేశాడు. అవి చూసుకొని శ్రుతి ఆమ‌ధ్య ఎంత ముచ్చ‌ట‌ప‌డిందో.