Begin typing your search above and press return to search.

ఓయ్.. ఈ భామ బిజీ అవుతుందా?

By:  Tupaki Desk   |   24 May 2018 6:18 AM GMT
ఓయ్.. ఈ భామ బిజీ అవుతుందా?
X

కొంత మంది హీరోయిన్స్ అప్పట్లో సింగిల్ సినిమాతో సరికొత్తగా కనిపించి ఆ సినిమా విడుదల తరువాత మళ్లీ కనిపించకుండా పోయేవారు. అలాంటి లిస్ట్ లలో చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి షామిలి ఉన్నారు. మణిరత్నం క్లాసిక్ మూవీ అంజలి సినిమాలో ఒక చిన్నారి పాత్రలో షామిలి ఎంతగా మెప్పించిందో అందరికి తెలిసిందే. అయితే మళ్లీ ఆమె చాలా కాలం తరువాత 2009 లో వచ్చిన ఓయ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

సినిమాలో సింపుల్ క్యారెక్టర్ బావున్నా కూడా ఆమె నటనపై పలు రకాల కామెంట్స్ వచ్చాయి. కళ్లతో సరిగ్గా హావభావాలు మ్యాచ్ కాలేవని టాక్ రావడంతో ఆ తరువాత ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఇక 9 ఏళ్ల తరువాత అమ్మమ్మ గారిల్లు అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. నాగ శౌర్య హీరోగా సుందర్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానుంది. ఈ శుక్రవారం (మే 25న) రిలీజ్ కానుంది. ట్రైలర్ లో షామిలి కొంచెం కొత్తగా కనిపిస్తోంది.

చూస్తుంటే సెకండ్ ఇన్నింగ్స్ లో కొంచెం బిజీ అయ్యేలా ఉందనే టాక్ వస్తోంది. అమ్మమ్మగారిల్లు సినిమాలో నాగ శౌర్య కి షామిలి మరదలిగా నటించింది. సినిమాపై ఇప్పటివరకు పెద్దగా పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వలేదు. ఛలో సినిమాతో హిట్ అందుకున్న నాగ శౌర్య క్రేజ్ ఈ సినిమాకు ఏమైనా ఉపయోగపడుతుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమా హిట్ అయితే షామిలికి మరికొన్ని ఆఫర్స్ అందుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.