Begin typing your search above and press return to search.

శమంతకమణి.. మోషన్ పోస్టర్ అదిరిందిగా

By:  Tupaki Desk   |   28 May 2017 7:07 AM GMT
శమంతకమణి.. మోషన్ పోస్టర్ అదిరిందిగా
X
చిన్నా పెద్దా అని తేడా లేదు.. తెలుగులో ఇద్దరు హీరోలు కలిసి నటించడం చాలా కష్టంగా ఉండేది ఒకప్పుడు. కానీ ఈ మధ్య చిన్న హీరోలే కాదు.. స్టార్లు కూడా కలిసి తరచుగా మల్టీస్టారర్లు చేసేస్తున్నారు. ఐతే టాలీవుడ్ ఈ మధ్య వచ్చిన మల్టీస్టారర్లన్నీ ఒకెత్తయితే.. నలుగురు యువ కథానాయకులు కలిసి చేస్తున్న ‘శమంతకమణి’ మరో ఎత్తు. నారా రోహిత్.. సుధీర్ బాబు.. సందీప్ కిషన్.. ఆది సాయికుమార్ కలిసి ‘భలే మంచి రోజు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో చేస్తున్న సినిమానే ‘శమంతకమణి’. ఇంట్రెస్టింగ్ టైటిల్.. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తో జనాల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఇప్పుడు వైవిధ్యమైన మోషన్ పోస్టర్ తో జనాల్లో మరింత క్యూరియాసిటీ పెంచేసింది.

హీరోలెవ్వరినీ చుూపించకుండా.. వాళ్ల వాయిస్ తోనే ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. చివర్లో ఒక పాత తరహా వింటేజ్ కారును చూపించారు. బహుశా ఆ కారు చుట్టూనే కథంతా తిరుగుతుందేమో. ఆ కారు పేరే.. శమంతకమణి ఏమో. ముందుగా సుధీర్ బాబు.. ‘‘పాత సినిమాలో ఐటెం సాంగ్ లో హీరోయిన్ పేరులా శమంతక మణి ఏంటండీ?’’ అని మొదలుపెడితే.. తర్వాత ఆది అందుకుని ‘‘కరెక్టుగా చెప్పారు.. నాదీ సేమ్ ఫీలింగ్’’ అంటాడు. ఆపై నారా రోహిత్.. ‘‘శమంతకమణా.. ఇదేదో పురాణాల్లో కథ లాగుంది’’ అంటే.. చివరగా సందీప్ కిషన్ ‘‘బ్రదర్ అక్కడ పడింది ఆ బొమ్మ కాదు’’ అని ముగిస్తాడు. ఈ డైలాగుల్ని బట్టి ఈ కథేంటన్నది అర్థం కాకపోయినా.. మోషన్ పోస్టర్ చూస్తే మాత్రం ఇదేదో వైవిధ్యమైన సినిమా అన్న భావన మాత్రం కలుగుతోంది. భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే హీరోల లుక్స్ రిలీజ్ చేయబోతున్నారట.