ఫోటో స్టొరీ: బికినీ పోజు.. బికినీ డెఫినిషన్!

Fri Jun 14 2019 17:18:36 GMT+0530 (IST)

బాలీవుడ్లో ఉండే లెక్కలేనంత మంది హాటు భామల్లో షమ సికందర్ ఒకరు. తన కెరీర్ మొదట్లో సినిమాల్లో నటించింది కానీ ఇప్పుడు పెద్దగా ఆఫర్లు లేవు.. అందుకే ఎక్కువగా హిందీ సీరియల్స్ లో తన సత్తా చాటుతోంది.  మధ్యలో ఎప్పుడో ఒకసారి హిందీ సినిమాలలో చిన్న పాత్రల్లో తళుక్కున మెరుపుతీగలాగా మెరిసి మాయమవుతుంది.  సినిమాలు.. సీరియల్స్.. ఇవేనా ఈ ప్రపంచంలో ఉండేవి.. మరేం లేవా?  మీకు వేరే ప్రపంచం ఉందో లేదో తెలీదు కానీ షమ కు మాత్రం సోషల్ మీడియా ఉంది.  ఆ సోషల్ మీడియాకు ఈ భామ హై ఎండ్ హీటర్  లాంటిది.  ఫోటో అప్లోడ్ చేస్తే చాలు.. సెకండ్లలో ఉష్ణోగ్రతలు పైపైకి వెళ్తాయి.షమ తన ఉష్ణోగ్రతల ఉద్యమాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ ఇన్స్టాలో తాజాగా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "బికినీ అనేది ముళ్ళ కంచె లాంటిది.  వ్యూ ను ఏమాత్రం చెడగొట్టకుండా ప్రాపర్టీని కాపాడుతుంది" అంటూ ఒక చిలిపి క్యాప్షన్ ఇచ్చింది.  ఫోటో స్టొరీలు రాసే వాళ్ళకే అల్లరి ఆలోచనలు వస్తాయని ఒక తప్పుడు అభిప్రాయం ఉంది కానీ షమ ఇచ్చిన క్యాప్షన్ ముందు ఈ ఫోటో స్టొరీలు.. చిలిపిరాతలు అన్నీ జుజుబి.  బికినీ వేసుకునే హాటు బ్యూటీలు చాలామందే ఉంటారు కానీ ఆ బికినీకి ఇంత అందమైన డెఫినిషన్ ఇంతవరకూ ఎవరూ ఇవ్వలేదు.  బికిని ధరించి నేలపై వయ్యారంగా పడుకుంది. తలకు హ్యాట్.. కళ్ళకు చలువ కళ్ళజోడు పెట్టుకుంది. ఫేస్ లో చిలిపి నవ్వు కూడా ఎంతో అందంగా ఉంది. ఆ ఫోటో గ్రాఫర్ ఈ ఫోటోను రివర్స్ లో తీయడంతో డిఫరెంట్ గా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ భామ సిడ్నీ నగరంలో ఉందట.  ఇదెలా తెలిసిందంటే.. ఒక నెటిజన్ నేల చల్లగా లేదా షమా? అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా "లేదు.. సిడ్నీలో వాతావరణం అద్భుతంగా ఉంది" అని సమాధానం ఇచ్చింది.  ఇక ఈ ఫోటోకు కామెంట్లు అదిరిపోయాయి.  "సిడ్నీ కు షమ బికినీ హీటు".. "రెడ్ హాట్ బికినీ కేరాఫ్ సిడ్నీ".. "అందానికి అసలైన నిర్వచనం నువ్వే".. "సెక్సీ లేడి ఆన్ ది ఫ్లోర్".. "సిడ్నీ కంటే షమ బ్యూటిఫుల్" అంటూ రెచ్చిపోయారు.