ఫోటో స్టొరీ: 4 లడ్డూలు కావాలా నాయనా

Sat May 25 2019 23:00:01 GMT+0530 (IST)

హిందీ సీరియల్స్ తో చాలా పాపులర్ అయిన భామ షమ సికందర్.  ఈ  భామ కొన్ని హిందీ సినిమాలలో కూడా నటించింది.  కానీ బాలీవుడ్ లో పెద్దగా బ్రేక్ రాకపోవడంతో సీరియల్స్ లో సెటిల్ అయిపోయింది. అలా అని మనం జీవితం ఇంతేలే అని సర్దుకుని పోయే బాపతు కాదు.  సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో క్షణాల్లో మంట పెట్టగల దిట్ట. తాజాగా అదే పని చేసింది.  కాకపోతే ఈ ఫోటో రెగ్యులర్ గా పోస్ట్ చేసే ఫోటోల కంటే ఫోర్ టైమ్స్ పవర్ఫుల్.షమా తన ఫోటోను పోస్ట్ చేస్తేనే.. "లడ్డూ కావాలా నాయనా" అని నెటిజనులను అడిగినట్టుగా ఉంటుంది. ఈసారి తనతో పాటు ఫోటోలో మరో ముగ్గురు అప్సరసలు ఉన్నారు.  "ఒకేసారి నాలుగు లడ్డూలు కావాలా నాయనా" అని అడిగినట్టుంది.  ఇంతకీ ఫోటోలో షమ ఎక్కడుందో గుర్తు పట్టారా? పూల్ వాటర్ లో మనకు లెఫ్ట్.  వాటర్ లో రైట్ సైడ్ ఉన్న భామ మన టాలీవుడ్ రత్తాలు రాయ్ లక్ష్మి.  మూడో అందగత్తె రైట్ సైడ్ లో పైన ఉంది కదా.. పేరు సోనాలి సెగల్. 'ప్యార్ కా పంచనామా' అనే బాలీవుడ్ సినిమాలో నటించింది. ఆ తర్వాత కూడా రెండు మూడు సినిమాల్లో నటించింది. ఇక లెఫ్ట్ సైడ్ పైన ఉన్న భామ పాపీ జబ్బాల్. పంజాబీ సినిమాలలో హీరోయిన్.  బాలీవుడ్ లో హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తూ ఉంది.

ఈ ఫోటో ఫుకెట్ లో తీసుకున్న పాత ఫోటో అని షమ వెల్లడించింది.  ఈ ఫోటోకు షమ ఇచ్చిన క్యాప్షన్ "మెర్మెయిడ్స్". నిజమే కదా.. సెక్సీ బికినీలు ధరించిన అందమైన  జలకన్యల మాదిరిగానే ఉన్నారు కదా? పిచ్చి నెటిజనులు. ఒక లడ్డూకే తట్టుకోలేరు. ఒకేసారి నాలుగు లడ్డూలతో సర్జికల్ స్ట్రైక్ చేసినట్టు ఉంది.  ఇలాంటి అందాలను చూడడానికి రెండు కళ్ళూ చాలవు.  ఇలాంటప్పుడే భగవంతుడు..మనకు ఓ పది కళ్ళు ఇస్తే.. దానికి తోడూ గుడ్లగూబలా నైట్ విజన్ కూడా ఇస్తే బాగుండేది పిచ్చి మనసుకు అనిపిస్తుంది. ఎందుకటే ఈ భామలు ఫోటోలు తీసుకుంది రాత్రిపూట.  నైట్ విజన్ ఉంటే అందాన్ని ఆస్వాదించడానికి లైట్లతో పనే ఉండదు.

ఈ ఫోటోకు లైకులే లైకులు. ఇక కామెంట్స్ కూడా మామూలుగా లేవు. ఒకరు "సుందర్ సుందర్ సుందర్ సుందర్" అన్నారు.  అర్థం అయింది కదా. నలుగురు బ్యూటీలకు విడివిడిగా బ్యూటిఫుల్ గా ఉన్నారని ఆ నెటిజనుడి ఉద్దేశం. మరొకరు "ఫోర్ హాట్ బాంబ్స్" అన్నారు. ఇంకొకరు "హాట్ లేడీస్ ఇన్ పూల్" అన్నారు. మరో నెటిజనుడు "లక్కీ స్విమ్మింగ్ పూల్" అన్నాడు.