Begin typing your search above and press return to search.

తమన్నాలా కాకుండా.. ఇంకేదైనా చూపిస్తా..

By:  Tupaki Desk   |   17 Oct 2017 5:30 PM GMT
తమన్నాలా కాకుండా.. ఇంకేదైనా చూపిస్తా..
X
మిల్కీ బ్యూటి తమన్నా అంటే.. గ్లామర్ క్వీన్ గా పేరొందింది. ఆమె ఏ సినిమా చేసినా కూడా.. ఆమె సీన్లలో సాంగ్సులో అందాలను ఆరేయడం అనేది తారాస్థాయిలో ఉంటుంది. అసలు సదరు అందంతోనే వరుసపెట్టి ఫ్లాపులనే కొడుతున్నా కూడా అవకాశాలను పట్టేసింది అమ్మడు. ఇప్పుడు పాయింట్ ఆమె గురించి కాదు.. ఆమె పాత్రను చేస్తున్న మరో హీరోయిన్ గురించే.

100% లవ్ సినిమాకు తమిళ రీమేక్ గా.. జివి ప్రకాష్‌ హీరోగా 100% కాదల్ వస్తోంది. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ అయిపోయిన హీరోయిన్ షాలినీ పాండే హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. అయితే తమన్నా తరహాలో మీరు కూడా అదే గ్లామర్ మరియు మహాలక్ష్మి పాత్రను అదే రీతిలో చేస్తారా అని అడిగితే.. ''నేను తమన్నాలా ఎందుకు చేస్తాను? నేను నాలాగా చేస్తాను. తమన్నా ఆ సినిమాలో చాలా బాగా చేసింది. చాలా అందంగా కూడా ఉంది. నేను కూడా ఇప్పుడు ఈ పాత్రను నా తరహాలో చేస్తాను. ప్రూవ్ చేస్తాను చూడండి'' అంటూ ధీమా వ్యక్తపరిచింది షాలిని.

అయితే తమన్నా తరహాలో గ్లామర్ ను ఆరబోయలేకపోవచ్చు కాని.. వేరే తరహాలో తన టాలెంట్ చూపిస్తానంటూ ఈ హిట్ లేడీ చెబుతోంది. ఏదేమైనా కూడా.. ఇప్పుడు షాలిన్ పాండే టైమ్ నడుస్తోంది. అందుకే ఆమె వరుస ఛాన్సులతో దూసుకుపోతోంది. మరి ఎన్ని హిట్లు కొడుతుందో ఇంకెన్ని ఛాన్సులు పడుతుందో తెలియాలంటే మాత్రం ఇంకాస్త వెయిట్ చేయాల్సిందే.