నో ఎక్స్ పోజింగ్.. ఎలాగబ్బా?

Wed Sep 13 2017 12:38:15 GMT+0530 (IST)

సినిమాల్లో హీరోయిన్లకు బ్రేక్ లభించడం కాస్త కష్టమైన విషయం. కానీ ఇప్పుడు హీరోలు ఎక్కువ.. హీరోయిన్స్ తక్కువగా కనిపిస్తుండడంతో.. కొత్త హీరోయిన్స్ చాలామంది క్లిక్ అవుతున్నారు. అయితే.. ట్యాలెంట్ తో కలిపి క్లిక్ అయింది అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే.ఈమెకు అవకాశాలు బాగానే వచ్చేస్తున్నాయి. పెద్ద సినిమాల్లోనే అవకాశాలు అందిపుచ్చుకుంటోందని అంటున్నారు. అయితే.. గ్లామర్ విషయంలో మాత్రం తనకు చాలానే స్వయం సరిహద్దులు ఉన్నాయని అంటోందీ భామ. సినిమాల్లో అస్సలు ఎక్స్ పోజింగ్ చేయను అని చెప్పేస్తోంది కూడా. అయితే ఇదే షాలినీ పాండే.. బయట మాత్రం ఇలా తను ధరించిన బంగారు మొలతాడు చూపిస్తూ రచ్చ చేస్తోంది. పైగా స్లీవ్ లెస్ డ్రెసింగ్ బాగా కామన్ గా కనిపిస్తోంది. అయితే ఈ బంగారు మొలతాడు ఫోటో కంటే కూడా.. ఇంపార్టెంట్ టాపిక్ మరొకటి ఉంది.

తెలుగులో చైతు-తమన్నా నటించిన 100 పర్సెంట్ లవ్ తమిళ్ రీమేక్ లో షాలినీ పాండేనే నటించబోతోంది. లావణ్య త్రిపాఠిని రీప్లేస్ చేసి మరీ ఈమెను తీసుకున్నారు.  అయితే.. ఆ మూవీలో తమన్నా ఓ బొడ్డు సీన్ లో కనిపిస్తుంది తమన్నా. హైపర్ బోలా అంటూ బొమ్మ గీసి మరీ చూపిస్తాడు చైతు. సినిమాలో ఈ సీన్ ఫన్నీగానే కాదు.. స్టోరీకి ఇంటర్ లింక్డ్ గా కూడా ఉంటుంది. మరి ఎక్స్ పోజింగ్ చేయనని అంటున్న ఈ భామ.. అర్జున్ రెడ్డిలో పాతిక ముప్ఫై మూతి ముద్దుల మారిదిగానే.. 100 పర్సెంట్ లవ్ లో కథ డిమాండ్ చేసింది కాబట్టి నాభి చూపించానని అంటుందా.. లేకపోతే ఆ సీన్ చేయనని దర్శకుడికి చెబుతుందో చూడాలి.