100% లవ్ లో అర్జున్ రెడ్డి భామ

Tue Sep 12 2017 12:38:28 GMT+0530 (IST)

అప్పటివరకు స్లోగా ఉన్న నాగ చైతన్య కెరీర్ కు బూస్ట్ ఇచ్చిన చిత్రం 100% లవ్. ఆ సినిమా తర్వాత చైతు తన మార్కెట్ ని కొద్దీ కొద్దిగా పెంచుకుంటూ వచ్చాడు. అపజయాలతో ఉన్న దర్శకుడు సుకుమార్ కూడా అదే సినిమాతో రికవర్ అయ్యాడు. అయితే ఈ సినిమాపై 'కొందరు పరభాషా నటీనటులు చాలా ఇష్టపడ్డారు.. రీమేక్ కూడా చెయ్యాలని ఆలోచించారు. కానీ ఏ ఒక్కరు సినిమాను పట్టాలెక్కించలేదు.  

కానీ ఇప్పుడు ఆ సినిమాను చంద్రమౌళి అనే తమిళ దర్శకుడు తెరకెక్కించడానికి డిసైడ్ అయ్యాడు. 100% లవ్ కథను ఆధారంగా తీసుకొని తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాను ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమాలో అర్జున్ రెడ్డి కథానాయికను ఫైనల్ చేశారట. అర్జున్ రెడ్డి లో ప్రీతీ పాత్రతో మంచి నటనను కనబరిచిన షాలిని పాండే తమన్నా పోషించిన మహాలక్ష్మి పాత్రకు కరెక్ట్ గా సెట్ అవుతుందని దర్శకుడు డిసైడ్ అయ్యాడట.
అయితే ఆ ప్రాజెక్టు లో మొదట లావణ్య త్రిపాఠి ని అనుకున్నారు. ఆగస్టు లో సినిమాను కూడా స్టార్ట్ చేయాలనుకున్నారు కానీ ఆమె డేట్స్ కరెక్ట్ గా సెట్ అవ్వకపోవడంతో సినిమా నుంచి తప్పుకుంది. అనవసరంగా ఈ సినిమాను వదిలేసుకుందని మనం చెప్పుకున్నాం కూడా.

దీంతో అదే సమయంలో అర్జున్ రెడ్డి సినిమాతో షాలిని ఫ్యామస్ అవ్వడంతో ఆమెను ఎంచుకున్నారు. షాలిని కి ఇప్పటికే భారీ ఆఫర్స్ వస్తున్నాయట కానీ ఆమె తొందరపడకుండా తన పాత్రకు ఇంపార్టెంట్ ఉన్న కథలనే ఒకే చేస్తోందట. మరి తమిళ్ 100% లవ్ లో మహాలక్ష్మి పాత్రకు 100% న్యాయం చేస్తుందో లేదో చూడాలి.