100% గట్టిగా హింట్ ఇచ్చేసింది

Thu Oct 12 2017 17:58:48 GMT+0530 (IST)


'నాకు నచ్చితేనే ఎక్స్ పోజింగ్ చేస్తాను తప్పించి.. అసలు ఏదో గ్లామరసం పండించాలి కాబట్టి అనుకుని నేను హాటుగా ఉండటానికి ఇష్టపడను. గ్లామర్ పాత్రలు నాకు అక్కర్లేదు' అంటూ తేల్చి చెప్పేసింది ''అర్జున్ రెడ్డి'' సినిమాతో ఫ్యామస్ అయిన షాలినీ పాండే. ఆ సినిమాలో అవసరం ఉంది కాబట్టే పెదాల ముద్దులూ తదితరాలు చేశాను కాని.. ఇతర సినిమాల్లో కూడా అవే కావాలంటే కష్టం అనేసింది.ఇదంతా చూసి.. అమ్మడు ఎంత క్రేజ్ తెచ్చుకున్నా కూడా ఒక కమర్షియల్ హీరోయిన్ గా నిలదొక్కుకోవడం కష్టమే అనుకున్నారు అందరూ. అయితే షాలినీ మాత్రం అందరి అంచనాలనూ పటాపంచలు చేస్తూ.. తన విచ్చేస్తున్న ప్రైవేట్ ఈవెంట్లలోనే భారీగా గ్లామరసం ఆరబోస్తోంది. కట్ చేస్తే.. తమిళంలో అమ్మడు జివి ప్రకాష్ సరసన 100% లవ్ సినిమా రీమేక్ ఒప్పుకుంది. ఈ సినిమా తెలుగు వర్షన్ లో మిల్కీ బ్యూటి తమన్నా ఏ రేంజులో గ్లామరస్ గా కనిపించిందో తెలిసిందే. అలాంటప్పుడు ఆ పాత్రను చేయదలుచుకున్న షాలినీ ఏం చేస్తుంది అనే సందేహం అందరికీ వస్తుంది. అయితే వాటన్నింటి గురించీ అమ్మడు గట్టిగానే హింట్ ఇచ్చేసింది.

ఈ సినిమాలో ఉన్న నాభి ని హైపర్ బోలా అంటూ వర్ణించే సీన్ ఏమో కాని.. అమ్మడు మాత్రం నిన్ని జరిగిన మూవీ లాంచింగ్ ఈవెంట్లో చక్కగా తన సోయగాలను దారబోస్తూ.. కమర్షియల్ హీరోయిన్లకు తను ఏ రేంజు పోటీ అవ్వబోతుందో ఒక హింట్ ఇచ్చేసింది. గమనించారా?