Begin typing your search above and press return to search.

షకీలా బయోపిక్.. ఇంట్రస్టింగ్ పాయింట్..

By:  Tupaki Desk   |   16 July 2018 4:29 AM GMT
షకీలా బయోపిక్.. ఇంట్రస్టింగ్ పాయింట్..
X
షకీలా.. మలయాళం సినిమా పరిశ్రమ నుంచి ఎదిగి దక్షిణాది భాషల్లో కూడా ఫేమస్ అయిన రోమాంటిక్ నటి.. సినిమాల్లో నటిగా మొదలైన ఆమె ప్రస్థానం ఆ తర్వాత అడల్ట్ స్టార్ గా ఎదిగే వరకూ సాగింది.. పలు హాట్ హాట్ రోమాంటిక్ మూవీలతో దక్షిణాదిన కాక పుట్టించింది. కొన్నేళ్ల క్రితం షకీలా మూవీ అంటే యువత ఎగబడి చూసేవారు. ఆమె సినిమాల వీసీడీలకు అప్పట్లో యమ గిరాకీ ఉండేది. నటి నుంచి పోర్న్ స్టార్ గా సాగిన షకీలా జీవితం ఎన్నో కష్టనష్టాల మయం.. ఎంతో మసాలా ఉన్న ఆమె జీవితాన్ని తెరకెక్కిస్తే కాసులు కురిపిస్తుందనే ఆశ సినిమా వర్గాల్లో ఉంది. ఇప్పుడది కార్యరూపం దాల్చింది.

ప్రస్తుతం బయోపిక్ ల కాలం నడుస్తోంది. తెలుగులో మహానటి - హిందీలో సంజు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యి కాసులు కురిపించాయో అందరికీ తెలిసిందే.. ఇక ఇటీవలే పోర్న్ స్టార్ సన్నీ లియోన్ బయోపిక్ ను కూడా తెరకెక్కించారు. సన్నీ పోర్న్ స్టార్ కావడంతో సినిమాగా చూపించలేమని.. సెన్సార్ లేని వెబ్ సిరీస్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈరోజు నుంచి సన్నీ లీయోన్ బయోపిక్ ‘కరణ్ జిత్ కౌర్: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్’ పేరుతో టీవీలో ప్రసారం కానుంది.

పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ గా ఎదిగిన సన్నీలియోన్ జీవితం వెబ్ సిరీస్ గా వస్తుండడంతో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని షకీలా బయోపిక్ ను మొదలుపెట్టారు. షకీలా జీవితం ఆధారంగా దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుంచి మొదలు కానుంది. షకీలా పాత్రను బాలీవుడ్ భామ రీచా చద్దా పోషించనున్నారు. ఈ బయోపిక్ లో షకీలా సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి అడల్ట్ స్టార్ గా ఎలా ఎదిగింది.? ఆ కష్టాల వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాలను ప్రస్తావిస్తారట.. ఎంతో ఆసక్తి గొలిపే ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.