Begin typing your search above and press return to search.

షకలక రూమర్లలో నిజం లేకపోలేదు

By:  Tupaki Desk   |   28 May 2016 11:30 AM GMT
షకలక రూమర్లలో నిజం లేకపోలేదు
X
అసలు జబర్దస్త్ ఫేం కమెడియన్‌ షకలక శంకర్‌ ను నిజంగానే పవర్‌ స్టార్‌ చాచి ఒక్కటిచ్చారా? అదంతా ఏమో గాని.. అసలు ''సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌'' సినిమాలో సరిగ్గా ఆనని షకలక శంకర్‌.. ఆ తరువాత నిజంగానే ఏ సినిమాలోనూ కాస్త ఇంట్రెస్టింగ్‌ పాత్రలో కనిపించలేదు. అయితే అప్పుడప్పుడూ మీడియా వారికి కొందరికి ఎదరుపడి.. అసలు విషయం ఏంటో చెప్పేస్తున్నాడు శంకర్‌.

''అంటే.. పవన్‌ కళ్యాణ్‌ నన్ను తిట్టిన మాట వాస్తవమే.. కాని కొట్టలేదు. మరీ అలా చేయరు ఆయన. కాకపోతే పెద్దాళ్ళతో.. డైరక్టర్ తో సరిగ్గా మసులకోమని చెప్పాడు. ఇంతకుముందు చాలామంది ఇదే విషయం నాకు చెప్పారులే'' అంటూ చెప్పుకొచ్చాడు షకలక శంకర్‌. నిజానికి మనోడు జబర్దస్త్ ప్రోగ్రామ్‌ నుండి బయటకు వచ్చేయడానికి కారణం ఏంటంటే.. ఆ ప్రోగ్రామ్‌ డైరక్టర్ తో గొడవపడటం.. అలాగే అక్కడి ఇతర పార్టిసిపెంట్ల మీద సెటైర్లు వేసి వారి ఇన్సల్ట్ చేయడమేనట. ఇక అదే పద్దతి సర్దార్‌ సెట్‌ లోనే కాదు.. చాలా సినిమాల షూటింగ్‌ స్పాట్లలో కంటిన్యూ చేశాడు మనోడు. చివరకు విషయం పవన్‌ దగ్గరకు చేరేసరికి.. ఆయన సర్దార్‌ సెట్ లో ఇతగాడి తీట తీర్చేశాడు.

ఇదే విషయంపై మాట్లాడుతూ.. ఇక తాను ఫుల్లుగా మారిపోయానని.. కేవలం కెరియర్‌ మీద ఫోకస్‌ చేస్తూ ముందుకు సాగుతానని చెప్పుకొచ్చాడు షకలక శంకర్‌. మనోడిలా ఎకసెక్కాలు చేసినందుకే చాలామంది కమెడియన్లు ఓ 2-3 ఏళ్ళలో కనిపించకుండా పోయారు. జాగ్రత్తమ్మా!!