Begin typing your search above and press return to search.

అమీర్.. బాహుబలి వెయిటింగ్

By:  Tupaki Desk   |   2 Aug 2015 9:34 AM GMT
అమీర్.. బాహుబలి వెయిటింగ్
X
బహుశా రాజమౌళి సైతం ‘బాహుబలి’ మొదలుపెడుతున్నపుడు తన సినిమాకు ఈ స్థాయిలో ప్రశంసలు దక్కుతాయని ఊహించి ఉండడేమో. శేఖర్ కపూర్ లాంటి హాలీవుడ్ దర్శకుడు, ఆనంద్ మహీంద్రా లాంటి బిజినెస్ టైకూన్.. మరెందరో బాలీవుడ్ ప్రముఖులు ‘బాహుబలి’ని చూసి మెస్మరైజ్ అయిపోయి.. రాజమౌళి అండ్ టీమ్ మీద ప్రశంసల జల్లు కురిపించారు. సల్మాన్ ఖాన్ సైతం బాహుబలి గురించి గొప్పగా మాట్లాడటం తెలిసిన సంగతే.

ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూడా లైన్లోకి వచ్చాడు. ఇన్నాళ్లూ ఫారిన్లో షూటింగ్ చేస్తూ బిజీగా ఉండటం వల్ల బాహుబలి చూడలేకపోయిన షారుఖ్.. ఇటీవలే ఇండియాకు వచ్చి సినిమా చూశాడు. వెంటనే ట్విట్టర్ తెరిచి సినిమా గురించి కామెంట్ పెట్టాడు. ‘‘బాహుబలి చాలా చాలా శ్రమించి తీసిన సినిమా. మాకు స్ఫూర్తిగా నిలిచినందుకు ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మనం ఓ అడుగు ముందుకేస్తేనే ఆకాశాన్ని అందుకోగలం’’ అని కామెంట్ పెట్టాడు షారుఖ్. బాహుబలి సినిమాకు సంబంధించి బెస్ట్ కాంప్లిమెంట్స్ లో ఇదొకటని చెప్పొచ్చు.

ఖాన్ త్రయంలో ఇద్దరు అయిపోయారు. ఇక మిగిలింది అమీర్ ఖాన్ ఒక్కడే. బాహుబలి గురించి అతడి అభిప్రాయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు రాజమౌళి తీసిన ‘మగధీర’ తెగ నచ్చేసి మనోడిని ముంబయికి పిలిపించుకుని మాట్లాడాడు అమీర్. ఇప్పుడు జక్కన్న ఇంకా ఎన్నో మెట్లు పైకెక్కి ‘బాహుబలి’ తీశాడు. దీనిపై అమీర్ ఏమంటాడో చూడాలి.