Begin typing your search above and press return to search.

షారుఖ్ కి స్థానముందట..

By:  Tupaki Desk   |   8 Oct 2015 7:30 PM GMT
షారుఖ్ కి స్థానముందట..
X
ఆదిత్య చోప్రా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికులు స్మరిస్తున్న పేరు. దర్శకుడిగా మూడంటే మూడు సినిమాలతో బోలెడంత మందిని సినీ ప్రేమికులను వశపరచుకున్నాడు. మూడు సినిమాలు వేటికవే అన్న స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించాయి. వీటన్నిటిలోనూ కామన్ షారుఖ్ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆదిత్య బేఫికర్ అనే సినిమాని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలోనూ షారుఖ్ ఉంటారని బాద్ షా ఫాన్స్ అనుకున్నా చివరికి రణ్ వీర్ సింగ్ ఆ అవకాశాన్ని ఎగరేసుకుపోయాడు.

అయినా షారుఖ్ ఫాన్స్ మరే నిరాశ పడాల్సిన పనిలేదు. షారుఖ్ కీ ఈ సినిమాలో స్థానముందట. అయితే ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాదట. గెస్ట్ రోల్ అని సమాచారం. అతిథి పాత్ర అయినా ఇలా వచ్చి వెళ్ళిపోయే పాత్ర కాదట. ఆ మేరకు ఆదిత్య షారుఖ్ పాత్రని తీర్చి దిద్దరాని యష్ రాజ్ ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఆదిత్య అమితంగా మెచ్చిన ఈ చాలెంజింగ్ సబ్జెక్ట్ అనౌన్స్ చేసినప్పట్నుండే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. షారుఖ్ ని భాగం చేయడంతో అది మరింత పెరిగినట్లైంది. చివరి విషయం ఏమిటంటే ఈ సినిమా వెండితెరపైకి వచ్చే వరకూ ప్రేక్షకులు ఆత్రం ఆపుకోలేక 'బేఫికర్'గా ఉండలేరు.