Begin typing your search above and press return to search.

హాలీవుడ్ కి నో ఎంట్రీ.. అందుకే

By:  Tupaki Desk   |   29 May 2016 9:39 AM GMT
హాలీవుడ్ కి నో ఎంట్రీ.. అందుకే
X
ఇప్పుడు చాలామంది బాలీవుడ్ తారలు హాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనేల హాలీవుడ్ ఎంట్రీపై భారీగా ప్రచారం జరుగుతున్నా.. తమ ట్యాలెంట్ తో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కేరక్టర్ ఆర్టిస్టులు మరికొంతమంది ఉన్నారు. అయితే.. బాలీవుడ్ కి బాద్షా అనిపించుకుంటున్న షారూక్ ఖాన్ మాత్రం ఇప్పటివరకూ హాలీవుడ్ వైపు అడుగులు వేయలేదు. దీనికి కారణం ఏంటో స్వయంగా చెప్పేశాడు షారూక్.

'హాలీవుడ్ మూవీస్ లో నటించేందుకు నేను సరిపోనని అనుకుంటున్నా. నాకు సొంత దేశంపై అభిమానం ఎక్కువ. ఇక్కడి ఫిలిం ఇండస్ట్రీ కోసం ఏదైనా చేయాలన్నది నా తాపత్రయం. కేవలం యాక్టర్ గానే కాకుండా.. ఏ రకంగా అయినా ఈ పరిశ్రమ కోసం చేయడానికి నేను సిద్ధం. హాలీవుడ్ మూవీస్ వైపు అడుగు వేయకపోవడానికి ఇంకో ప్రధాన కారణం ఉంది. నాకు సిగ్గు ఎక్కువ. కొత్త వాళ్ల ముందు ఇబ్బంది పడతాను. అందుకే ఫ్రెండ్స్ తోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంటా' అని చెబుతున్నాడు షారూక్ ఖాన్.

అలాగని వేరే భాషల్లో నటించే వారిపై ఈ బాద్ షాకి చిన్నచూపేం లేదు. వాళ్లని ఆదర్శంగా తీసుకుంటానని అంటున్నాడు. అయితే వాళ్లలా ఉండాలంటే మాత్రం తనకు భయమని.. అందుకే తన పరిధికే పరిమితమవుతానని తేల్చేశాడు షారూక్ ఖాన్.