Begin typing your search above and press return to search.

అతడి లెగ్ కి సినిమా ఫ్లాప్ కి లింకేంటి?

By:  Tupaki Desk   |   22 May 2016 5:30 PM GMT
అతడి లెగ్ కి సినిమా ఫ్లాప్ కి లింకేంటి?
X
బ్లాక్ బస్టర్ ఆశిస్తే దానికి పూర్తి వ్యతిరేకంగా డిజాస్టర్ వైపు పరుగులు పెడుతూ అటు ఫ్యాన్స్ ని ఇటు సినిమా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. రాజీపడని నిర్మాణ విలువలతో తెరకెక్కించిన ఈ సినిమా భారీ నష్టాన్ని చవిచూడనుంది.

అయితే ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి సవాలక్షకారనాలుండగా కొందరు మాత్రం కొత్త సెంటిమెంట్ రీజన్ చూపిస్తున్నారు. అదేంటి అంటే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ హైదరాబాద్ లో తన సినిమా దిల్వాలే షూటింగ్ జరుపుకున్న విజిట్ చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయట.

స్వతహాగా ఆయన నటించిన సినిమా ఫ్లాప్ అవ్వడమే కాక ఆయన విజిట్ చేసిన రెండు సినిమాలు అలాంటి చేదు అనుభవాన్నే మిగిల్చాయట. ఆ సినిమాలు ఏమిటంటే ఒకటి చరణ్ నటించిన బ్రూస్ లీ మరొకటి మహేష్ నటించిన బ్రహ్మోత్సవం. సెంటిమెంటల్ గా సరిపోయినా ఇందులో లాజిక్ ఎక్కడుంది బాసూ...