Begin typing your search above and press return to search.

సోఫియాకు ఐల‌వ్ యూ చెప్పిన సూపర్ స్టార్!

By:  Tupaki Desk   |   22 Feb 2018 11:37 AM GMT
సోఫియాకు ఐల‌వ్ యూ చెప్పిన సూపర్ స్టార్!
X

విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు శంక‌ర్ - త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రోబో సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ కాంబోలో తెర‌కెక్కుతున్న రోబో 2.ఓ త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. రోబో సినిమాలో వ‌శీక‌ర‌ణ్ రూపొందించిన `చిట్టి` రోబో త‌ర‌హాలోనే నిజ జీవితంలో కూడా `సోఫియా` అనే ఒక హ్యూమ‌నాయిడ్ రోబోను రూపొందించారు. హాంకాంగ్‌ కి చెందిన హాన్సన్‌ రోబోటిక్స్‌ సంస్థ తయారుచేన సోఫియాను 2015 ఏప్రిల్‌ 19న యాక్టివేట్‌ చేశారు. 62కు పైగా ముఖ కవళికలను ప్రదర్శించగ‌ల ఈ రోబోకు 2017 అక్టోబర్ లో సౌదీ అరేబియా పౌరసత్వం కూడా ల‌భించింది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌నుషుల‌తో సంభాషించ‌గ‌లిగే ఏకైక రోబో సోఫియా కావ‌డం విశేషం.

తాజాగా, హైదరాబాద్ లో జరిగిన వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ(డ‌బ్ల్యూసీఐటీ) సదస్సులో సోఫియా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. త‌న ఫేవ‌రెట్ హీరో బాలీవుడ్ బాద్షాహ్ షారుక్ ఖాన్ అని తెలిపింది. దీనికి తాజాగా కింగ్ ఖాన్ కూడా స్పందిస్తూ ట్వీట్ చేశాడు. డ‌బ్ల్యూసీఐటీలో ప్రపంచంలోనే పౌరసత్వం కలిగిన తొలి రోబో ‘సోఫియా’ కు ఆ స‌ద‌స్సు హోస్ట్ ప‌లు ప్ర‌శ్న‌లు అడిగారు. `నీకు నచ్చిన హీరో ఎవరు?`అన్న ప్ర‌శ్న‌కు సోఫియా....‘షారుక్‌ ఖాన్‌’ అని సోఫియా సమాధానమిచ్చింది. దీంతో, షారుక్ ...సోఫియాకు ట్విట్ట‌ర్ ద్వారా రిప్లై ఇచ్చారు. ‘నా భారతదేశానికి వచ్చిన మహిళకు బహిరంగంగా నా ప్రేమను వ్యక్తం చేస్తున్నాను. అణువణువులో నువ్వు నన్ను అనుకరించావు సోఫియా’ అని షారుక్‌ ట్వీట్‌ లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం షారుక్ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.