Begin typing your search above and press return to search.

వాళ్లిద్ద‌రి ముద్దు షేక్ చేసేస్తోంది

By:  Tupaki Desk   |   5 Feb 2016 7:30 AM GMT
వాళ్లిద్ద‌రి ముద్దు షేక్ చేసేస్తోంది
X
బాలీవుడ్లో లిప్ లాక్స్ కు కొద‌వేముంది చెప్పండి. ఈ విష‌యంలో ఒక‌ర్ని మించి ఒక‌రు రెచ్చిపోతున్నారు. తెర‌మీద లాంగ్ లాంగ్ కిస్సులు వేడి పుట్టించేస్తున్నాయి. ఐతే ఆ లాంగ్ ఎరోటిక్ కిస్సుల కంటే కూడా.. బాలీవుడ్ ఎవ‌ర్ గ్రీన్ జంట మ‌ధ్య ఓ చిన్నపాటి ముద్దు ఇంట‌ర్నెట్లో వైర‌ల్ అవుతోంది. ఆ జంట మ‌రెవ‌రో కాదు.. షారుఖ్ ఖాన్‌, కాజోల్‌. దిల్ వాలే, దుల్హానియా లేజాయేంగే, కుచ్ కుచ్ హోతా హై - కభీ ఖుషి కభీ గమ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించిన ఈ జంట.. ఈ మధ్యే ‘దిల్ వాలే’ అనే సినిమాలో జంటగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. షారుఖ్, కాజోల్ ల కెమిస్ట్రీ కూడా సినిమాను కాపాడలేకపోయింది.

ఐతే సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఈ మధ్య ‘దిల్ వాలే’ మేకింగ్ వీడియోస్ కొన్ని బయటికి వదిలింది ఈ టీమ్. ఐతే ఆ వీడియోల్లో ఒకదాంట్లో షారుఖ్ ఖాన్ కాజోల్ కు ముద్దు పెట్టడం జనాల్లో ఆసక్తి రేపుతోంది. సినిమాల్లో ముద్దుల కంటే ఈ ముద్దు మీద జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు యూట్యూబ్ తో పాటు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో భారీగా హిట్స్ వస్తున్నాయి. జనాలు ఈ వీడియోను తెగ షేర్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. షారుఖ్, కాజోల్ జంట ఏం చేసినా జనాలకు వినోదమే అనడానికి ఈ వీడియో మరో ఉదాహరణ.