షారుఖ్ సైతం చిందేసాడు

Sun Dec 09 2018 22:33:48 GMT+0530 (IST)

దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ పెళ్లి గురించే చర్చ ఉంది. ఇప్పటికే ఈ వేడుక తాలూకు ఫోటోలు వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆఖరికి పేదలకు దివ్యంగులకు అన్నదానం చేసినా సంచలనం అవుతోంది. ఇక సెలబ్రిటీలు వస్తే చెప్పేదేముంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ఉదయ్ పూర్ నగరం తారాకాంతులతో తళుక్కుమంటోంది. అక్కడే ఉన్న జనానికి ఇవి చూసేందుకు రెండు కళ్ళు చాలడం లేదు.ముఖ్యంగా కింగ్ ఖాన్ బాద్షా షారుఖ్ భార్య గౌరీ తో చేసిన డాన్స్ తాలూకు వీడియోలు ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రైవేట్ వేడుకల్లో షారుఖ్ డాన్స్ చేయడం కొత్త కాదు కానీ భార్యతో స్టెప్స్ వేయడం మాత్రం అభిమానులు కూడా ఎప్పుడు చూడలేదు. ఆ అరుదైన దృశ్యానికి అంబానీ పెళ్లి పందిరి వేడుకగా మారింది. వస్తున్న తారలను చూసి మీడియాకు సైతం మతి పోతోంది. అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ వారు వారు అని కాకుండా మొన్న పెళ్లి చేసుకున్న ప్రియాంకా చోప్రాతో సహా అందరు కుటుంబ సమేతంగా విచ్చేస్తున్నారు. ప్రభాస్ కూడా ప్రత్యేక అతిధిగా ఆహ్వానింపబడ్డాడు. అయినా ఇందులో ఆశ్చర్యం లేదు లెండి.

అపర కుబేరుడి కూతురి పెళ్లి అంటే ఆ మాత్రం హంగామా ఉండాలి కదా. పైగా లక్షల ఖరీదు చేసే వివాహ పత్రిక అందాక రాకుండా మనసు ఊరుకుంటుందా. ఉదయ్ పూర్ ఎన్నడూ చూడని వెలుగులతో ఏకంగా ప్రపంచవ్యాప్త మీడియానే ఆకర్షించింది. ఆనంద్ పిరమల్ ను మనువాడుతున్న ఈషా అంబానీ ఆనందం అయితే మాములుగా లేదు. అంతే మరి రాజు గారు తలుచుకుంటే రాజ్యాలే కదిలి వస్తాయి. స్టార్లు ఎంత అనిపిస్తోంది కదూ. నిజమే మరి