Begin typing your search above and press return to search.

హీరో ఇండియాలో.. నిర్మాత బీచ్ లో..

By:  Tupaki Desk   |   27 July 2017 11:27 AM GMT
హీరో ఇండియాలో.. నిర్మాత బీచ్ లో..
X
బాలీవుడ్ షారూక్ ఖాన్ ఇప్పుడు తన రాబోతున్న సినిమా పై మంచి నమ్మకంగానే ఉన్నాడు. సినిమా కూడా ప్రేమ కథే అవ్వడంతో షారూక్ పెద్ద గా నటించవలిసిన పని లేకుండా పోయింది ఎందుకంటే మనవాడికి అది కొట్టిన పిండి కదా. ఇప్పటికే క్లాసిక్ లవ్ స్టోరీలలో నటించి అందరినీ అలరించిన షారూక్ ఇప్పుడు మరో కొత్త రకం ప్రేమ కథ ‘జాబ్ హ్యారి మెట్ సెజల్’ తో మన ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమా సంబందించి ప్రమోషన్ కూడా కొత్తగానే చేస్తున్నాడు షారూక్. సినిమా షూటింగ్ పూర్తి కావడం తో షారూక్ తన ఫ్యామిలి తో కలిసి టూర్ కి వెళ్ళాడు. అయితే షారూక్ కి ఇండియాలో తన సినిమా పాట ఒకటి విడుదల చేసే పని ఉండడంతో తన భార్య గౌరి ఖాన్ ను, చిన్న కొడుకు అబ్రామ్ ను కూతురు సుహానా ను మాలిబు బీచ్లో వదిలేసి వచ్చేశాడు. లాస్ ఏంజలీస్ దగ్గరలో ఉన్న ఒక బీచ్ లో ఇలా షారూక్ ఫ్యామిలి ఇసుకలో ఆడుకుంటూ సముద్ర కేరటాలును చూస్తూ ఆస్వాదిస్తున్నారు. కూతురు కొడుకు ఇసుకలో ఆడుకుంటుంటే గౌరి ఖాన్ ఆ మధుర క్షణాలు ను దాచుకావాలి అనిపించి ఒక ఫోటో తీసి పెట్టుకుంది. ఆ ఫోటో కి ఒక పేరు కూడా పెట్టింది ‘అవధులు లేని మాలిబు బీచ్ ఇసుక తీరం’ అని.

అసలు సినిమాను షారూక్ తన ప్రమోషన్లో బిజీ గా ఉంటే నిర్మాత గౌరి ఖాన్ మాత్రం ఇలా సేద తీరుతోంది. ఏమాటకామాట చెప్పాలంటే.. గౌరి కూడా ఓ రకంగా తన అందాలను పిచ్చత్తోస్తోంది అంతే. ఆ పక్కనే సుహానా కూడా నేనేమన్నా తక్కువ అన్నట్లుంది.