Begin typing your search above and press return to search.

షారూక్ సోకులకు 4 కోట్ల బస్సు

By:  Tupaki Desk   |   5 Sep 2015 10:26 AM GMT
షారూక్ సోకులకు 4 కోట్ల బస్సు
X
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తన సోకుల దారి కొత్త పుంతలు తొక్కారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అత్యాధునికమైన వ్యానిటీ వేన్ ను తయారు చేయించారు. ఈ వ్యానిటీ వ్యాను ఖరీదు రూ.4 కోట్లు.

50 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సిక్స్ ప్యాక్ లు సెక్సీలుక్ లతో కిక్కెంచించే ఈ బాలీవుడ్ సోగ్గాడు ఏం చేసినా స్పెషలే. అందరికంటే భిన్నంగ ఉండాలని కోరుకునే షారూక్ వ్యానిటీ వ్యాన్ విషయంలోనూ మిగతా హీరోలకు అందనంత దూరంలో నిలిచాడు. షారూక్ కొత్త వ్యానిటీ వ్యానులో చాలా సౌకర్యాలున్నాయట. ఇందులో ప్రత్యేకమైన వంటగది.. వార్డ్ రోబ్, స్పెషల్ మేకప్ కుర్చీ, ప్రత్యేకమైన టాయిలెట్, షవర్ బాత్ సదుపాయం... ఒకటా రెండా అనేక సౌకర్యాలతో ఇంట్లో(షారూక్) ఉన్నట్లు... ఇంద్ర భవనంలో ఉన్నట్లు అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారట.

ఇంతకీ దీన్ని ఎక్కడ తయారుచేశారో తెలుసా... ఇండియాలోనే. అవును.. పుణెలోని ప్రముఖ కార్ల డిజైనర్ దిలీప్ ఛాబ్రియా దీనికి హంగులద్దారట.