Begin typing your search above and press return to search.

ఈ జంటకు బాలీవుడ్‌ లో ఎంత క్రేజో

By:  Tupaki Desk   |   25 Nov 2015 7:30 AM GMT
ఈ జంటకు బాలీవుడ్‌ లో ఎంత క్రేజో
X
బాలీవుడ్ చాక్లెట్‌ బోయ్ షాహిద్ క‌పూర్ గురించి ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఉత్త‌రాది హీరోల్లో ప్రామిస్సింగ్ హీరోగా అత‌డికి గుర్తింపు ఉంది. ఈ ఏడాది మిడిల్‌ లో ఢిల్లీ అమ్మాయి మీరా రాజ్‌ పుత్‌ ని వివాహ‌మాడాడు. ఓ కాలేజ్ అమ్మాయిని పెళ్లాడుతున్న సీనియ‌ర్ బ్యాచిల‌ర్ అంటూ ఉత్త‌రాది మీడియా తెగ హ‌డావుడి చేసేసింది. ఏదేమైనా షాహిద్ ఓ ఇంటివాడ‌య్యాడు. ఈ జంట అన్యోన్యంగా దాంప‌త్య జీవ‌నం సాగించ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌.

చిలుకా గోరింక‌ల్లా క‌లిసి మెలిసి ఉంటున్న తీరుపైనా సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన చ‌ర్చ సాగుతోంది. అంతేకాదు షాహిద్ త‌న భార్య మీరాతో క‌లిసి దిగిన ఫోటోల్ని అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌పై అభిమానుల ముందుకు తెస్తున్నాడు. ఆ బాట‌లోనే లేటెస్టుగా ఓ ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. దీనికి అభిమానుల నుంచి అదిరిపోయే స్పంద‌న వ‌చ్చింది. బాహుబ‌లి ట్రైల‌ర్‌ కి కూడా రాన‌న్ని క్లిక్‌ లు 24 గంట‌ల్లో ఈ ఫోటోకి వ‌చ్చాయంటే అతిశ‌యోక్తి కాదు. 24 గంట‌ల్లో 12 ల‌క్ష‌ల లైక్స్‌.. 10 వేల కామెంట్స్‌.. 5,500 మందికి షేరింగ్ .. వ‌చ్చిన ఏకైక ఫోటో ఇది. అందుకే ప్ర‌స్తుతం చాక్లెట్‌ బోయ్ గురించి బాలీవుడ్‌ లో మ‌రో ఇంట్రెస్టింగ్ టాపిక్ చ‌ర్చ‌కొచ్చింది.

యాక్ష‌న్ జాక్స‌న్‌ - షాన్‌ దార్ త‌ర్వాత ప్ర‌స్తుతం షాహిద్ క‌పూర్ ఉడ్తా పంజాబీ చిత్రంలో న‌టిస్తున్నాడు. అభిషేక్ చౌబీ ద‌ర్శ‌క‌త్వంలో అనురాగ్ క‌శ్య‌ప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. త్వ‌ర‌లోనే మూవీ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక నుంచి ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో మీరా రాజ్‌ పుత్‌ తో క‌లిసి మెరిసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.