Begin typing your search above and press return to search.

కొంపదీసి హీరోయిన్‌ ని చేస్తాడేమో!!

By:  Tupaki Desk   |   30 Aug 2015 4:05 AM GMT
కొంపదీసి హీరోయిన్‌ ని చేస్తాడేమో!!
X
షాహిద్‌ కపూర్‌ ఇటీవలే బ్యాచిలర్‌ షిప్‌ వదిలేసి సంసార జీవనంలోకి అడుగుపెట్టాడు. స్వతహా రాధాస్వామి డివోటీ కాబట్టి ఆ సాంప్రదాయంలోనే గురువుల సమక్షంలో ఢిల్లీ అమ్మాయి మీరా రాజ్‌ పుత్‌ ని పెళ్లాడేశాడు. సినిమా హీరో సినిమా హీరోయిన్‌ నే పెళ్లాడాలి.. అన్న రూల్‌ ని బ్రేక్‌ చేసి, అసలు ఆ ప్రపంచానికే సంబంధం లేని ఓ కాలేజ్‌ స్టూడెంట్‌ ని పెళ్లాడి అందరికీ సర్‌ ప్రైజ్‌ నిచ్చాడు.

పెళ్లి చేసుకుని, ఆ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకుని సినిమాలు, బుల్లితెర షోలు పూర్తి చేసుకుని ఇటీవలే మీరా రాజ్‌ పుత్‌ తో హనీమూన్‌ ప్లాన్‌ చేశాడు ఈ చాక్లెట్‌ బోయ్‌. ఆ తర్వాత ఈ జంట ఏం చేస్తున్నారు? అన్నదానికి అప్‌ డేట్‌ వచ్చింది. షాహిద్‌ ఉన్నట్టుండి భార్య మీరా రాజ్‌ పుత్‌ తో కలిసి ఓ ర్యాంపుపై తళుక్కుమన్నాడు. ముంబైలో జరిగిన ఈ ఈవెంట్‌ లో షాహిద్‌ - మీరా జంట సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌ అయ్యింది.

మీరా టాప్‌ టు బాటమ్‌ అదరగొట్టేసింది. ఫ్యాషన్‌ అండ్‌ ట్రెండ్స్‌ ని అనుకరించడంలో సినిమా తారలెవరూ తనకి సాటిరారని నిరూపించింది. మీరాలోని జోష్‌ చూస్తుంటే కొంపదీసి హీరోయిన్‌ అయిపోతుందా? అనిపించింది. షాహిద్‌ అంత పనీ చేసేట్టే ఉన్నాడు సుమీ!