హిందీ అర్జున్ రెడ్డి లీప్ లాక్ లీక్

Sun Jan 20 2019 16:04:40 GMT+0530 (IST)

తెలుగులో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ షాలిని పాండేల 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. తమిళంలో కూడా ఈ చిత్రం రీమేక్ అవుతున్నప్పటికి అందరి దృష్టి హిందీ రీమేక్ పైనే ఉంది. షాహిద్ కపూర్ కైరా అద్వానీ జంటగా అర్జున్ రెడ్డి రీమేక్ 'కబీర్ సింగ్' గా రూపొందుతుంది. అర్జున్ రెడ్డిలో మించిన ముద్దు సీన్స్ కబీర్ సింగ్లో ఉంటాయని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఇప్పటి వరకు 'కబీర్ సింగ్' గురించిన ఎలాంటి విషయాలు బయటకు రాలేదు. కేవలం టైటిల్ లోగో ఆవిష్కరించడంతో పాటు హీరో లుక్ ను కాస్త రివీల్ చేశారు. అయితే తాజాగా ఢిల్లీ యూనివర్శిటీలో చిత్రీకరణ చేస్తున్న సమయంలో అక్కడ విద్యార్థులు షూటింగ్ సందర్బంగా షాహిద్ కపూర్ కైరా అద్వానీలను తమ కెమెరాల్లో బంధించేశారు. అలాగే షాహిద్ కపూర్ కైరాల ముద్దు సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో కూడా వీడియలో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సినిమాలో చూపుదామనుకున్న షాహిద్ కైరాల ముద్దు సీన్స్ ఇప్పుడు యూట్యూబ్ సోషల్ మీడియా వేదికలపై సందడి చేస్తున్నాయి. చాలా నాచురల్ గా అర్జున్ రెడ్డిలో తరహాలోనే ముద్దు సీన్స్ ఉన్నాయంటూ టాక్ వస్తుంది. తెలుగు దర్శకుడు సందీప్ వంగానే అక్కడ కూడా దర్శకత్వం వహిస్తున్నాడు కనుక చాలా సహజంగా ముద్దు సీన్స్ వచ్చేలా ప్లాన్ చేశాడు. అందుకే అవి నిజంగా సినిమా షూట్ కు సంబంధించిన ముద్దు సీన్సా లేదంటే రియల్ ముద్దు సీన్సా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ముద్దు సీన్స్ లీక్ అవ్వడంతో 'కబీర్ సింగ్' కు ప్లస్ కూడా అయ్యింది. సినిమాపై ఒక్కసారిగా బజ్ పెరిగింది.