Begin typing your search above and press return to search.

వీడియో: ఈ గులాబో అదిరిపోయింది

By:  Tupaki Desk   |   11 Sep 2015 6:01 AM GMT



ఆలియాభ‌ట్‌, షాహిద్ క‌పూర్ జంట‌గా న‌టించిన షాన్దార్ అక్టోబ‌ర్ 22న రిలీజ‌వుతోంది. ఈసినిమాలో మొద‌టి పాట‌ను ఆన్‌ లైన్‌ లో రిలీజ్ చేశారు. గులాబో అంటూ సాగే లిరిక్ అదిరిపోయింది. వీడియో మేకింగ్ స్ట‌యిల్‌, కొరియోగ్ర‌ఫీ అదిరిపోయాయి. ఈ పాట ఇటీవ‌లి కాలంలో రాని కొత్త స్టయిల్లో సాగుతోంది.

ముఖ్యంగా ఈ సాంగ్‌లో ఆలియాభ‌ట్ మీసం పెట్టుకుని అదిరిపోయే ఎక్స్‌ ప్రెష‌న్‌ తో ఆక‌ట్టుకుంది. షాహిద్ క‌పూర్ గ‌ళ్ల‌ప్యాంటు, న‌ల్ల‌కోటు, హ్యాటుతో పెప్పీగా, సంథింగ్ స్పెష‌ల్‌ గా క‌నిపించాడు. కొరియోగ్ర‌ఫీలో సంథింగ్ ఏదో కొత్త‌ద‌నం ఉంద‌నిపించింది. బాలీవుడ్ హీరోల్లోనే ట్యాలెంటెడ్ హీరోగా షాహిద్ క‌పూర్‌ కి పేరుంది. హృతిక్‌ రోష‌న్ త‌ర్వాత మ‌ళ్లీ అంత గొప్ప డ్యాన్స‌ర్‌ గానూ గుర్తింపు ఉంది. న‌వ‌త‌రం నాయిక ఆలియాతో క‌లిసి షాహిద్ వేసిన స్టెప్పులు యూత్‌ కి పిచ్చెక్కిస్తాయ‌న‌డంలో సందేహ‌మే లేదు.

ఆలియా మీసం, షాహిద్ గ‌ళ్ల ఫ్యాంటు ఈ పాట‌లో వెరీ స్పెష‌ల్‌. అక్టోబ‌ర్‌ లో ద‌స‌రా కానుక‌గా వ‌స్తున్న షాన్దార్ పెద్ద సక్సెస్‌ నే కొడుతుందని ప్రస్తుతానికి బాలీవుడ్‌ లో నమ్మతున్నారు. చూద్దాం. షాహిద్‌ పెళ్లయ్యాక వస్తున్న మొదటి సినిమా. హిట్టు కొడితేనే కిక్కబ్బా!!