Begin typing your search above and press return to search.

హిందీ 'జెర్సీ' లో షాహిద్ కపూర్...?

By:  Tupaki Desk   |   14 Oct 2019 8:52 AM GMT
హిందీ జెర్సీ లో షాహిద్ కపూర్...?
X
చాలా సంవత్సరాల నుండి బాలీవుడ్ లో సరైన హిట్స్ లేక సతమతమౌతున్న యువ హీరో షాహిద్ కపూర్ తెలుగులో సూపర్ హిట్ అయిన 'అర్జున్ రెడ్డి' మూవీని రీమేక్ చేసి 'కబీర్ సింగ్' పేరుతొ విడుదల చేస్తే అక్కడ ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ ఒక్క సినిమాతో షాహిద్ అక్కడ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. అంతేకాదు తన కొత్త సినిమాలకు రెమ్యూనరేషన్ కూడా షాహిద్ విపరీతంగా పెంచేశాడు. దాదాపుగా అతను ఇప్పుడు సినిమాకు 40 కోట్ల రెమ్యూనరేషన్ అడుగుతున్నాడని బాలీవుడ్ లో అనుకుంటున్నారు. షాహిద్ తన తర్వాతి సినిమా కూడా తెలుగు సినిమానే రీమేక్ చేస్తున్నాడు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన 'జెర్సీ' మూవీ తెలుగులో మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇందులో నాని నటన అద్భుతం. ఇప్పుడు ఈ సినిమాపై షాహిద్ కన్ను పడింది. ఈ సినిమాను బాలీవుడ్ ప్రొడ్యూసర్ అమన్ గిల్ తో కలిసి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు - అల్లు అరవింద్ లు హిందీలో నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. 'జెర్సీ' సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకి కూడా డైరెక్షన్ చేయనున్నాడు. తెలుగులో హీరోయిన్ గా చేసిన శ్రద్ధ శ్రీనాథ్ పాత్రను హిందీలో రష్మిక చేస్తుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేసి వచ్చే సంవత్సరం ఆగస్టులో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.