Begin typing your search above and press return to search.

షాహిద్ కపూర్ రివర్స్ ఎటాక్

By:  Tupaki Desk   |   22 Jun 2019 7:06 AM GMT
షాహిద్ కపూర్ రివర్స్ ఎటాక్
X
ఇప్పటిదాకా బాలీవుడ్ లో అసలు బోల్డ్ సీన్స్ సెక్స్ కంటెంటే రానట్టు కబీర్ సింగ్ లో మాత్రమే వీటిని చూపించినట్టు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్న కొందరు బాలీవుడ్ క్రిటిక్స్ కు షాహిద్ కపూర్ తనదైన శైలిలో బదులు ఇస్తున్నాడు. కథలో ఇంటెన్సిటీని అర్థం చేసుకోకుండా కేవలం ఓ సీన్ ని బేస్ చేసుకుని కామెంట్స్ ఎలా చేస్తారని రివర్స్ కౌంటర్ ఇస్తున్నాడు.

హీరోయిన్ ని చెంపదెబ్బ కొట్టానని ఓపెనింగ్ సీన్ లో పర్వర్ట్ గా కనిపించానని విమర్శిస్తున్న వాళ్లకు గల్లీ బాయ్ లో లవర్ ఫ్రెండ్ అయిన అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కొడితే అది మాస్టర్ పీస్ లా కనిపించిందా అంటూ ఘాటుగానే అడుగుతున్నాడు. నిజానికి షాహిద్ కపూర్ ఆవేదనలో నిజమంది. కొన్ని సైట్స్ లో కబీర్ సింగ్ మీద వ్యక్తమైన అభిప్రాయాలు అలాగే ఉన్నాయి మరి.

గతంలో ఎన్నో బూతు సినిమాలను బోల్డ్ అండ్ సెక్స్ నెస్ ని విచ్చలవిడిగా చూపించిన మూవీస్ ని వదిలేసి ఆల్రెడీ ఓ రీజనల్ లాంగ్వేజ్ లో యాక్సెప్ట్ చేసిన రీమేక్ ని ఇలా విమర్శించడం చూసే ఆడియన్స్ కూడా సోషల్ మీడియాలో ఈ ధోరణిపై దుమ్మెత్తిపోశారు. షాహిద్ కపూర్ మాత్రం వీటి సంగతి ఎలా ఉన్నా చాన్నాళ్ల తర్వాత దొరికిన సోలో సక్సెస్ ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు. మొదటిరోజు కెరీర్ బెస్ట్ ఇచ్చిన కబీర్ సింగ్ ఫైనల్ గా ట్రిపుల్ డిజిట్ చేరుకోవడం ఖాయమని ట్రేడ్ టాక్