Begin typing your search above and press return to search.

డిసెంబరు 7న బ్రహ్మాండం బద్దలేనట..

By:  Tupaki Desk   |   2 Dec 2016 7:30 PM GMT
డిసెంబరు 7న బ్రహ్మాండం బద్దలేనట..
X
షారుఖ్ ఖాన్ నిఖార్సయిన హిట్టు ముఖం చూసి చాలా కాలం అయిపోయింది. వరుసగా చెత్త సినిమాలు చేసిన కారణంగా ఈ మధ్య మంచి సినిమాలు చేసినా జనాలు పట్టించుకోని పరిస్థితి ఎదురైంది. సమ్మర్లో రిలీజైన ‘ఫ్యాన్’కు చాలా మంచి రివ్యూస్ వచ్చాయి కానీ.. సినిమా నిలబడలేదు. ఈ చిత్రం కనీసం వంద కోట్లు కూడా వసూలు చేయకపోవడం షారుఖ్ కు పెద్ద అవమానమే. లేటెస్టుగా రిలీజైన ‘డియర్ జిందగీ’కి కూడా ఫుల్ పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఐతే కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. ఇప్పుడు షారుఖ్ నుంచి కలెక్షన్ల వర్షం కురిపించే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. ‘రాయీస్’ అలాంటి సినిమానే అని బాలీవుడ్ జనాల నమ్మకం.

రెండేళ్ల కిందట మొదలైన సినిమా రాయిస్. ఈ ఏడాది ఆగస్టులోనే రిలీజవ్వాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. పాకిస్థాన్ హీరోయిన్ని పెట్టుకోవడం వల్ల సినిమా మరింత ఆలస్యం అవుతోంది. ఐతే వచ్చే ఏడాది జనవరి 26న మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు షారుఖ్. ఈ నెల 7న ‘రాయీస్’ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ముందుగా అభిమానులతో ట్విట్టర్లో చిట్ చాట్ చేసి.. ఆ తర్వాత తనే స్వయంగా ట్రైలర్ లాంచ్ చేస్తాడట షారుఖ్. 7న రాయిస్ ట్రైలర్ రాబోతోందంటూ మొన్న ట్విట్టర్లో ఒక హ్యాష్ ట్యాగ్ పెడితే.. అది వరల్డ్ వైడ్ ట్రెండ్ అయింది. ఇక ట్రైలర్ లాంచ్ రోజు సోషల్ మీడియాలో మరింత హంగామా చేయాలని ఫిక్సయ్యారు షారుఖ్ ఫ్యాన్స్. గత ఏడాది వచ్చిన ‘రాయిస్’ టీజర్ అప్పట్లో సంచలనం రేపింది. ట్రైలర్ అంతకంటే పెద్ద సంచలనమే అవుతుందని అంటున్నారు. రాహుల్ డోలాకియా దర్శకత్వం వహించిన ఈ సినిమాను షారుఖ్ ఖాన్ తో పాటు ఫర్హాన్ అక్తర్ నిర్మించడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/