పిల్లల కోసం సూపర్ స్టార్ కష్టాలు

Mon Mar 20 2017 12:47:58 GMT+0530 (IST)

షారుక్ ఖాన్.. సిగరెట్.. ఈ రెండు కలిసిన కారణంగా ఎన్నో వివాదాలు తలెత్తాయి. అటు సినిమాల కోసం గానీ.. ఐపీఎల్ కోసం కానీ.. ఇమేజ్ కోసం కానీ.. ఏనాడు సిగరెట్లను విడిచిపెట్టని బాలీవుడ్ సూపర్ స్టార్.. ఇప్పుడు మాత్రం వాటికి దూరం జరగాలని భావిస్తున్నాడు.

ఇందుకు కారణం షారూక్ చిన్నారి కుమారుడు అబ్రామ్ కావడమే అసలైన విషయం. తాజాగా జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ 2017లో పాల్గొన్న షారూక్.. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ను అలవర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. ఇందుకు కారణం.. తన 4 ఏళ్ల కుమారుడు అబ్రామ్ అన్న కింగ్ ఖాన్.. తనతో ఎక్కువ సమయం గడపలేకపోతున్న విషయాన్ని అంగీకరించాడు. చేతికి చిక్కిన కొద్దిపాటి సమయంలో కూడా తన అలవాట్ల కారణంగా కొంత మిస్ అయిపోతున్నట్లు చెప్పిన షారూక్.. స్మోకింగ్.. డ్రింకింగ్ అలవాట్లను మానేసేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నాడు.

ఇందుకు మరో రీజన్ ఏంటంటే షారూక్ తన 15 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఇప్పుడు తన కుమారుడికి అలాంటి పరిస్థితి రాకూడదని.. కనీసం 25 ఏళ్లు వచ్చేవరకూ తను అండగా నిలవాలని అనుకున్నట్లు చెప్పాడు కింగ్ ఖాన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/