Begin typing your search above and press return to search.

2018కి కూడా పక్కా ప్లానింగ్ వేసేశాడు

By:  Tupaki Desk   |   1 Sep 2016 4:49 AM GMT
2018కి కూడా పక్కా ప్లానింగ్ వేసేశాడు
X
టాలీవుడ్ కి బాలీవుడ్ కి ప్రధానమైన తేడా ఎక్కడొస్తుందంటే.. ప్లానింగ్ లోనే అని చెప్పాలి. మనోళ్లు ఒక్కోసారి ఒక్కో సినిమానే చేసుకుంటూ.. దాన్నే ఎప్పటికి రిలీజ్ చేస్తారో కూడా తెలీదు. అనుకున్న టైమ్ కి సినిమా రిలీజ్ చేస్తే అదో మహాద్భుతం అన్నట్లుగా ఉంటుంది సిట్యుయేషన్. కానీ బాలీవుడ్ లెక్కలు అలా ఉండవు. అక్కడంతా ముందే కర్చీఫ్ వేసేసి.. ఆ డేట్ కి వచ్చేయడమే.

ఇప్పటికే 2017కి సంబంధించి ప్రతీ పండగను స్టార్ హీరోలు పంచేసుకున్నారు. ఇప్పుడు 2018 డిసెంబర్ 21 అంటే.. రెండేళ్ల తర్వాత క్రిస్మస్ ను బుక్ చేసేసుకున్నాడు బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్. 'ఆనంద్ ఎల్ రాయ్.. షారూక్ ఖాన్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాను అనౌన్స్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. 2018 డిసెంబర్ 21న విడుదల చేస్తాం. త్వరలో టైటిల్ వెల్లడిస్తాం' అంటూ షారూక్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టెయిన్మెంట్ ప్రకటించింది.

'ఈ ప్రాజెక్టు మా అందరికీ చాలా ప్రత్యేకం. టైటిల్ కూడా చాలా స్వీట్ గా ఉంటుంది. వెయిట్ చేయండి' అంటూ షారూక్ రీట్వీట్ చేశాడు. టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు కానీ.. 2018 క్రిస్మస్ మాత్రం నాదే అంటున్నాడు బాలీవుడ్ కింగ్ ఖాన్.