Begin typing your search above and press return to search.

'కేన్స‌ర్' అభిమానికి షారుక్ వీడియో...వైర‌ల్‌!

By:  Tupaki Desk   |   21 Oct 2017 12:03 PM GMT
కేన్స‌ర్ అభిమానికి షారుక్ వీడియో...వైర‌ల్‌!
X
త‌మ అభిమాన హీరోల‌ను క‌లుసుకోవాల‌ని చాలామందికి కోరిక‌గా ఉంటుంది. అయితే, ఆ ల‌క్ అంద‌రికీ ద‌క్క‌దు. అయితే, దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారు - కేన్స‌ర్ తో పోరాడుతున్న వారి కోరిక‌ల‌ను కొంద‌రు హీరోలు తీరుస్తుంటారు. గ‌తంలో ఖ‌మ్మం జిల్లాకు చెందిన శ్రీ‌జ‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆసుప‌త్రికి వెళ్లి ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. అదే త‌ర‌హాలో కేన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్న ఓ అభిమాని కోరిక‌ను బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నెర‌వేర్చాడు. ఆమెను స్వ‌యంగా వెళ్లి ప‌ల‌క‌రించ‌క‌పోవ‌డం కుద‌ర‌క‌పోవ‌డంతో ప్ర‌త్యేకించి ఓ వీడియో సందేశాన్ని ఆమెకు పంపాడు. ఆమె బంధువుల‌తో మాట్లాడి ఆమె యోగ‌క్షేమాలు తెలుసుకున్నాడు. త్వ‌ర‌లోనే ఆమెను క‌లుస్తాన‌ని చెప్పాడు. దీంతో, ఆమె ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఆ వీడియో వైర‌ల్ అయింది.

అరుణా పీకే అనే మ‌హిళ‌ ఆరేళ్లుగా కేన్స‌ర్‌ తో బాధ‌ప‌డుతోంది. ఆమె షారుక్ ఖాన్ కు వీరాభిమాని. షారుక్ అంటే త‌న‌కు ప్రాణ‌మ‌ని - ఆయ‌న‌ను క‌ల‌వ‌డ‌మే త‌న చివ‌రి కోరిక అని ఆమె గ‌త జూలైలో కొన్ని ట్వీట్లు చేసింది. కొద్దిరోజుల క్రితం ఆమె ఆరోగ్యం కొద్దిగా క్షీణించింది. ఆమె పిల్ల‌లు ప్రియాంక - అక్ష‌త్‌ లు త‌మ‌ త‌ల్లి చివ‌రి కోరిక‌ను తీర్చాల‌నుకున్నారు. కానీ, త‌మ లాంటి సామాన్యుల కోసం షారుక్ వంటి సెల‌బ్రిటీ రావ‌డం క‌ష్ట‌మ‌ని భావించారు. దీంతో, వారు సోష‌ల్ మీడియాలో #SRKMeetsAruna అనే హ్యాష్‌ ట్యాగ్‌ తో హాస్పిట‌ల్ బెడ్ మీద న‌వ్వులు చిందిస్తున్న అరుణ ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌ లో షేర్ చేశారు. నెటిజ‌న్లంతా ఈ హ్యాష్‌ ట్యాగ్‌ ను షారుక్ కి చేరే వ‌ర‌కు షేర్‌ చేశారు. శుక్ర‌వారం నాడు ఈ హ్యాష్‌ ట్యాగ్ ట్విట్ట‌ర్‌ లో ట్రెండింగ్ గా మారింది. చివ‌ర‌కు ఆ హ్యాష్ ట్యాగ్ గురించి షారుక్ కు తెలిసింది. అయితే, ఆయ‌న ప్ర‌త్య‌క్షంగా వ‌చ్చి అరుణ‌ను క‌ల‌వ‌క‌డం సాధ్యం కాలేదు. దీంతో, ఆమె కోసం ఓ వీడియో సందేశాన్ని పంపాడు షారుక్‌. అంతేకాదు, ఆమె పిల్ల‌ల‌తో ఫోన్ మాట్లాడి అరుణ క్షేమ‌స‌మాచారాలు తెలుసుకున్నాడు. ఆ వీడియోలో అరుణ క్షేమంగా ఉండాల‌ని, త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకున్నాడు. త్వ‌ర‌లోనే ఆమెను క‌ల‌వ‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని షారుక్ చెప్పాడు. బిజీ షెడ్యూల్ లో కూడా షారుక్ స్పందించ‌డంతో అరుణ‌తో పాటు ఆమె పిల్ల‌లు - నెటిజ‌న్లంద‌రూ సంతోషం వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.