Begin typing your search above and press return to search.

​పాపం పసిపిల్ల .. కెమెరాలు ఆపండయ్యా

By:  Tupaki Desk   |   23 Jun 2017 1:18 PM GMT
​పాపం పసిపిల్ల .. కెమెరాలు ఆపండయ్యా
X
బాలీవుడ్ సూపర్ స్టార్ సినిమా విడుదల అంటే దేశంలో ఒక పండుగ వచ్చినట్లే. అందులోనూ ముగ్గురు ఖాన్స్ లో ఎవ్వరిదైనా ఉంది అంటే ఇంకా ఆ సందడి కోలాహలం వేరే చెప్పేది ఏమి ఉంటుంది. మీడియా ఇంటర్వ్యూలు, టాక్ షో లు, సోషల్ మీడియా మార్కెట్ ఇలా ఎన్ని విదాలుగా మార్కెట్ చేయవచ్చో అన్నీ చేస్తారు అభిమానులుకు దగ్గరకావడానికి. మరి వారి సాటి నటీనటులు కోసం స్పెషల్ స్క్రీనింగ్ కూడా వేస్తారు. ఇలానే వేశారు సల్మాన్ ఖాన్ ‘ట్యూబు లైట్’ సినిమాను. దానికి అప్పటి తరం హిరోయిన్లు నుండి ఇప్పుడు నటిస్తున్న నటులు వరకు అందరూ వచ్చారు.

సినిమా చూడ్డానికి వచ్చిన సెలబ్రిటీల్లో షారూక్ ఖాన్ కూతురు కూడా వచ్చింది. కాకపోతే అక్కడ ఉన్న మీడియా కొంచం లక్ష్మణ రేఖ దాటి ఆ పిల్లను ఇబ్బంది పెట్టారు. షారూక్ ఖాన్ గారాలు కూతురు సుహానా ఖాన్ ట్యూబు లైట్ సినిమా చూడటానికి వచ్చి.. కింద ఫ్లోర్ నుండి పైకి వెళ్దాముని లిఫ్ట్ దగ్గరకు వచ్చి లిఫ్ట్ బటన్ నొక్కి వెయి్ట్ చేస్తుండగా.. ఎలా వచ్చారో కానీ కొంతమంది మీడియా వాళ్ళు లోపలికి వచ్చి వరస పెట్టి ఆపకుండా క్లిక్లు కొడుతూనే ఉన్నారు. సుహానా కొంతవరకు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఎలాగో నిలబడింది కాని.. ఈ లోపు లిఫ్ట్ వస్తాది అనుకుంటే అది రావటం లేదు. వీళ్ళు వదులుతారు అనుకుంటే వీళ్ళు వదలరు. వద్దు అని చెప్పితే అది ఒక గొడవ, పోనీ పళ్ళు ఇకిలించి నవ్వితే అది ఇంకో గొడవ. అక్కడ ఆ పిల్ల ఇబ్బంది చూస్తే ఎవరికైనా పాపం పసిపిల్ల అనుకొక మానారు.

సుహాన ఖాన్ బాలీవుడ్ లో కాబోయే నటి అని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు అక్కడ ఫిల్మ్ వర్గాలు. సోషల్ మీడియా లో సెర్చ్ ఇంజిన్లో ఇప్పుడు ఈ స్టార్ కిడ్ కోసం చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. ఇంకా ఖరారు కానీ స్టార్ కిడ్ కి ఇప్పటికే మంచి ఫాలోవర్స్ బేస్ ఏర్పడింది.​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/