సూర్య-షారుఖ్ ఖాన్ లు ఒకేసారి

Tue Mar 12 2019 20:00:01 GMT+0530 (IST)

ఇది అరుదైన కలయిక అనే చెప్పాలి. మాములుగా ఇద్దరు సౌత్ స్టార్ హీరోలు కలిసి నటిస్తేనే అదో పెద్ద సెన్సేషన్ లా ఫీలవుతాం. అలాంటిది నార్త్ లోనే కాదు హోల్ ఇండియాలోనే బాద్షా అనిపించుకున్న షారుఖ్ ఖాన్ సౌత్ లో స్టార్స్ లో ఒకరిగా వెలిగొందుతున్న సూర్య ఒకే సినిమా కోసం టీమ్ అప్ అయితే దాన్ని ఇంకేమనాలి. ఇది సాధ్యం కాబోతోంది. రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ పేరుతో సుప్రసిద్ధ ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే.మాధవన్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఇస్రోలో పని చేస్తున్నప్పుడు తీవ్ర అభియోగాలు ఎదురుకున్న నంబి నారాయణ్ ఆ తర్వాత నిర్దోషిగా బయట పడ్డారు. సుప్రీమ్ కోర్ట్ క్లీన్ చిట్ ఇవ్వడమే కాక కేరళ ప్రభుత్వం 50 లక్షలు పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘటనల సమూహారమే రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్. ఇప్పటికే కీలక భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని సమ్మర్ కి ప్లాన్ చేశారు

ఇందులోనే షారుఖ్ ఖాన్ సూర్యలు క్యామియోల్లో నటించబోతున్నారట. వీటి తాలూకు సీన్స్ ని త్వరలోనే షూట్ చేయబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. తొలుత వేరే దర్శకుడు మొదలుపెట్టినా ఫైనల్ గా ఇది మాధవన్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఆ చనువుతోనే సూర్య షారుఖ్ లను మాధవన్ ఒప్పించినట్టు తెలిసింది. ఇప్పటికే మంచి అంచనాలు రేకెత్తిస్తున్న రాకెట్రీకి ఈ క్యామియోలు చాలా పెద్ద ప్లస్ పాయింట్ గా నిలవనున్నాయి. సినిమాలో ఏ సందర్భంలో వీళ్ళిద్దరూ వస్తారు ఎంతసేపు ఉంటారు అనే వివరాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్