Begin typing your search above and press return to search.

దేశభక్తి రేటు 5 కోట్ల రూపాయలా?

By:  Tupaki Desk   |   25 Oct 2016 4:23 AM GMT
దేశభక్తి రేటు 5 కోట్ల రూపాయలా?
X
పాక్ నటులు ఉండడంతో 'యే దిల్ హై ముష్కిల్' మూవీని విడుదల కానివ్వబోమని మహరాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించడం.. రీసెంట్ గా ఆ వివాదాన్ని పరిష్కరించుకోవడం పూర్తయిపోయాయి. విడుదలకు అడ్డంకులు అయితే తొలగాయ్ కానీ.. వివాదం మాత్రం మరో టర్న్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

యే దిల్ హై ముష్కిల్ విడుదల కోసం.. ఆ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ రూ.5 కోట్ల మొత్తాన్ని ఆర్మీ ఫండ్ కు విరాళం ఇచ్చేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అంటే.. కరణ్ జోహార్ తన దేశ భక్తిని ప్రూవ్ చేసుకోవడానికి 5 కోట్లు కట్టాడంటున్నారు సీనియర్ బాలీవుడ్ నటి షబానా అజ్మీ. ఆ లెక్కన 5 కోట్లకు దేశభక్తిని అమ్మారా అన్నది ఆవిడ ప్రశ్న. 'ఎంఎన్ ఎస్ నేతలు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సినిమాకి ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించాల్సిన మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్.. 5 కోట్లకు బ్రోకరింగ్ డీల్ మాట్లాడ్డం సబబుగా లేదు' అంటున్నారామె.

కేంద్ర హోం మంత్రి సినిమా రిలీజ్ కు అడ్డంకులు ఉండబోవంటే.. ఫడ్నవీస్ 5 కోట్లకు దేశభక్తిని కొనుక్కుంటున్నారని షబానా అజ్మీ అంటున్నారు. తిరిగి తిరిగి మహరాష్ట్ర ముఖ్యమంత్రి తలకు ఈ వివాదం చుట్టుకునేలా ఉందనే టాక్ వినిపిస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/