ట్రైలర్ టాక్: బ్రూస్ లీ అక్క భలే షాకిచ్చిందే

Tue Oct 10 2017 23:21:36 GMT+0530 (IST)

కన్నడ బ్యూటీ కృతి కర్బందా.. టాలీవుడ్ లో డిఫరెంట్ సినిమాల్లోనే నటించింది. అటు హీరోయిన్ గా నటించడమే కాదు.. ఇటు రామ్ చరణ్ కు అక్కగా నటించేందుకు అంగీకరించి.. బ్రూస్ లీ మూవీతో షాక్ ఇచ్చింది. ఇప్పుడీ భామ హిందీలో తెగ బిజీ అయిపోతోంది. వరుస సినిమాలతో అదరగొట్టేస్తోంది.రాజ్ రీబూట్ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి.. ఆ తర్వాత గెస్ట్ లిన్ లండన్ ద్వారా మంచి నటి అని కూడా ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు షాదీ మే జరూర్ ఆనా అంటూ ఇందులో రాజ్ కుమార్ రావ్ కు జోడీగా నటిస్తోంది కృతి కర్బందా. ఇప్పుడీ మూవీకి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. బాగా చదువుకోవాలని తపన పడే అమ్మాయిగా కృతి కర్బందాని చూపిస్తూ ట్రైలర్ స్టార్ట్ చేయగా.. అమ్మాయి గురించి తెలుసుకుని ఫ్రెండ్ షిప్ చేసుకుని పెళ్లి చేసుకోవాలని భావించే కుర్రాడిగా హీరో దర్శనం ఇస్తాడు. ఇద్దరి మధ్య మంచి రిలేషన్ సెట్ అవుతుంది. పెళ్లికి ముందు లవ్ స్టోరీ బాగానే నడిపేస్తారు. కానీ సడెన్ గా పెళ్లి రోజున పెళ్లికొడుక్కి అనుకోని షాక్.

ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డపుడు.. హీరోయిన్ పై యుద్ధం చేసేందుకు రెడీ అవుతాడు హీరో. మొదట సగం ట్రైలర్ ను లవ్ ఫీల్ తో నింపితే.. రెండో సగాన్ని ఎమోషన్స్ తో క్యారీ చేశారు. అన్ని రకాల సన్నివేశాల్లోనూ కృతి కర్బందా సూపర్బ్ గా ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లో ఉన్న ట్విస్ట్ కరెక్ట్ గా పండితే మాత్రం.. జనాలకు సినిమా నచ్చేయడం ఖాయం. మరి బ్రూస్ లీ అక్క అదృష్టం ఎలా ఉందో చూడాలి.