న్యాచురల్ స్టార్ తో సీరియల్ మర్డర్లు ?

Wed Jun 12 2019 16:33:16 GMT+0530 (IST)

జెర్సీలో గుండెలు పిండే సెంటిమెంట్ తో మెప్పించిన న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు గేర్ మార్చి కొత్త కొత్త జానర్లు ట్రై చేస్తున్నాడు. గ్యాంగ్ లీడర్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టు కాగా ఆ తర్వాత వచ్చే ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా వి క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతోంది. లీకైన న్యూస్ ప్రకారం నాని పాత్ర ఇందులో వరసగా హత్యలు చేస్తూ ఉంటుందట. ఎక్కడికక్కడ క్లూస్ దొరుకుతున్నా అంతుచిక్కని రీతిలో తప్పించుకుని తిరుగుతున్న నాని కోసం వెతుకుతున్న పోలీస్ గా సుధీర్ బాబు పాత్ర సరికొత్త తరహాలో సాగుతుందట.ఓ నవల ఆధారంగా రాసుకున్న కథను ఇంద్రగంటి చాలా హై ఇంటెన్సిటీతో తెరకెక్కిస్తున్నట్టు తెలిసింది. ఆదితిరావు హైదరి నివేదా థామస్ పాత్రలు కూడా కేవలం ఆడిపాడటం కోసం కాకుండా చాలా కీలకంగా ఉంటాయట. అసలు నాని ఇన్నేసి మర్డర్లు ఎందుకు చేస్తున్నాడు అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేదే ఇందులో అసలు పాయింట్. నిజమో కాదో కానీ ఇంకో న్యూస్ కూడా చక్కర్లు కొడుతోంది.

చాలా ఏళ్ళ క్రితం సుప్రసిద్ధ రచయిత మల్లాది వెంకటకృష్ణ మూర్తి గారు మిస్టర్ వి అనే పేరుతో క్రైమ్ నవల ఒకటి రాశారు. అది అప్పట్లో సెన్సేషన్ కుడానూ. మరి ఇది దాని ఆధారంగా రూపొందిందా ఇంకేదైనా వేరే పుస్తకమో హాలీవుడ్ సినిమానో స్ఫూర్తిగా తీసుకున్నారా ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఏడాదే వి విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వి టైటిల్ ఇప్పటికే ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది. కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉంటే హిట్టు గ్యారెంటీనే